Begin typing your search above and press return to search.
చచ్చినోళ్ల లెక్క కావాలా - ఇంకొక్క రోజు ఆగండి
By: Tupaki Desk | 5 March 2019 4:59 PM GMTసర్జికల్ స్టైక్స్ అయిన దగ్గరనుంచే మోదీ ప్రభుత్వాని విపక్షాలు టార్గెట్ చేశాయి. సర్జికల్ స్టైర్స్ దేశానికి మంచిదే అని చెప్పిన విపక్షాలు.. ఆ క్రెడిట్‌ను మాత్రం మోదీ ఎక్కౌంట్ లో పడేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. అందుకే..స్టైక్స్ అయినపోయిన రెండు రోజుల తర్వాతి నుంచే విమర్శలు మొదలుపెట్టాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లి దాడులు చేశానని అన్నారు.. దానికి ఆధారాలు చూపించగలరా అని మమతా - దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్లు ప్రశ్నించారు. ఇక దాడులు జరిగిన మాట నిజమేనని జైషే మొహమ్మదే ప్రకటించింది. అటు ఎయిర్ చీఫ్ కూడా దాడుల్లో 300 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. ఒకవేళ నిజంగా చనిపోతే.. ఫోటోలు - ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు.
విపక్షాల ప్రశ్నలతో హోంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పిచ్చెక్కిపోయింది. ఇప్పటికే ఎయిర్ ఛీప్ చెప్పినా కూడా నమ్మరా అంటూ విపక్షాలపై సీరియస్ అయ్యారు రాజ్ నాథ్ సింగ్. వాయిసేన దాడుల్లో ఎంత మంది చనిపోయారో చెప్పాలని కొంత మంది నేతలు - ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఈరోజు లేదా రేపటిలోగా సమాధానం లభిస్తుంది. పాకిస్తాన్ నాయకుల హృదయానికి మాత్రమే ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం తెలుస్తుంది. ఎంత మంది చచ్చారు అంటూ మనవాళ్లు పదే పదే అడగటం చూస్తుంటే.. మెరుపు దాడుల తర్వాత వైమానిక దళమే అక్కడికి వెళ్లి శవాలను లెక్కించాలని డిమాండ్ చేసేలా కనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు.. దాడులు జరిగిన సమయంలో 300 ఫోన్లు యాక్టివ్ గా ఉన్నాయని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పిందని గుర్తుచేశారు. చెట్లు మొబైల్ ఫోన్లు వాడవు కదా అని విపక్షాలకు చురకలు అంటించారు రాజ్ నాథ్ సింగ్.