Begin typing your search above and press return to search.
దీపిక కు కాంగ్రెస్ మద్దతు.. ఛపాక్ మూవీ టికెట్లు పంపిణీ
By: Tupaki Desk | 11 Jan 2020 9:43 AM GMTజేఎన్యూ యూనివర్సిటీ లో విద్యార్థుల పై అమానుషం గా దాడి చేసిన హిందూ సంఘాలకు వ్యతిరేకంగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొనే గళమెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు జేఎన్యూ యూనివర్సిటీకి వెళ్లి వారికి సంఘీభావం తెలిపింది.
దీపిక చర్యతో ఖంగుతున్న బీజేపీ ఆమెపై విమర్శలు చేసింది. దేశ సైనికులు చనిపోతే పండుగ చేసుకున్న జేఎన్యూ విద్యార్థులకు సపోర్టు చేస్తావా అని కేంద్ర మంత్రి సృతీ ఈరానీ ధ్వజమెత్తారు. దీపిక కాంగ్రెస్ మద్దతుదారు అంటూ ఆడిపోసుకుంది.
అయితే తాజాగా దీపిక ప్రధాన పాత్రలో ఓ యాసిడ్ బాధితురాలు జీవిత కథ ఆధారంగా తీసిన ‘ఛపాక్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీని బీజేపీ హిందుత్వ సంఘాలు బహిష్కరించాయి. దీపిక జేఎన్యూ విద్యార్థులకు మద్దతు... బీజేపీకి వ్యతిరేకం గా మాట్లాడినందుకు వారు సినిమాను చూడకుండా బ్యాన్ విధించారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా దీపికకు మద్దతు ప్రకటించింది. అంతటితో ఊరుకోకుండా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దీపిక సినిమా ‘ఛపాక్’ టికెట్లు కొని ఉచితంగా పంచిపెట్టారు. అందరూ సినిమా చూడాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ ఫైట్ గా మారి సినిమాపై ప్రభావం చూపుతోంది.