Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో.. కొత్త మార్పు

By:  Tupaki Desk   |   9 Jan 2019 11:12 AM GMT
కాంగ్రెస్ లో.. కొత్త మార్పు
X
కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఉండదనే విషయం అందరికీ తెల్సిందే. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొంత కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో పార్టీలో ఎవరైనా దూషణలకు పాల్పడితే షోకాజ్ నోటీసులతో సరిపెట్టేవారు. కాగా ఇటీవల కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పై ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపైనే ఇప్పడు ప్రజల్లో చర్చ జరుగుతోంది

తెలంగాణలో పార్టీ ఓటమిపై సమగ్రంగా చర్చించుకోవాలే తప్పా వ్యక్తిగత దూషణలకు పాల్పడి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ అధిష్టానం సర్వే సస్పెన్షన్ తో సంకేతాలిస్తుంది. పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తే ఎంతటి వారి పైనా వేటు తప్పదని చెబుతుంది.

త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో పార్టీ నేతలు ఐకమత్యంగా గెలుపుకోసం కృషి చేయాలని హైకమాండ్ సూచిస్తోంది. సాధారణ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు వ్యతాసం ఉండటంతో ప్రజల ఆలోచనా విధానం మారుతుందని అందుకనుగుణంగా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్య నేతలు సూచిస్తున్నారు. వచ్చే పంచాయతీ, లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీకి మనోదైర్యాన్ని నింపుతోంది.

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో ధిక్కార ధోరణిని అధిష్టానం కూడా చూసినట్లు వదిలేశారు. ఎవరైనా పార్టీ నేతలపై విమర్శలు చేస్తే షోకాజ్ నోటీసులతో సరిపెట్టేవారు. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతటి వారైనా క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే వేటు తప్పదంటున్నాయి. మరి టీపీసీసీ కఠిన వైఖరిని కార్యకర్తలు ఏవిధంగా తీసుకుంటారో వేచి చూడాలి మరీ.