Begin typing your search above and press return to search.
కేసీఆర్ కే అసమ్మతి.. కాంగ్రెస్ ప్లాన్ సూపర్
By: Tupaki Desk | 1 Nov 2018 3:30 PM GMTకేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ పై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇక్కడ నుంచే ఎన్నో పథకాలు - అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రారంభించారు. టీఆర్ ఎస్ కు బలమైన నియోజకవర్గాల్లో మొన్నటి వరకు గజ్వేల్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో రానురాను మార్పు వచ్చింది. అసమ్మతి పెరిగింది. ఇటువంటి వారిని కాంగ్రెస్ చేరదీసి అక్కడ జెండా ఎగరవేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుండడం గులాబీ శ్రేణుల్లో కలవరానికి గురిచేస్తోంది.
ఇక్కడి మాజీ ఎమ్మెల్యే - రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఇన్నాళ్లు కొనసాగిన తూంకుంట నర్సారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరుపున కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీఆర్ ఎస్ లో చేరిపోయారు. హామీ మేరకు ఇచ్చిన పదవి - అంతలా ప్రాధాన్యం లేదనే అసంతృప్తిలో ఉన్నారు. అంతేగాక పార్టీలోనూ ప్రాధాన్యం లేకపోవడం ఆయనను కలిచివేసింది.
అలాగే, టీడీపీ తరుపున పోటీచేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థే. గత ఎన్నికల్లో ఈయన రెండోస్థానంలో నిలవగా - తూంకుంట నర్సారెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. ఇద్దరికి బలమైన క్యాడర్ ఉంది. నర్సారెడ్డి వల్ల టీఆర్ ఎస్ కు పెద్దగా లాభం లేకపోయినా - పార్టీ వీడటం వల్ల భారీ నష్టమే జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి - నర్పారెడ్డి బలం కూడా తోడైతే టీఆర్ ఎస్ ఇబ్బందులు పడటం ఖాయమని కాంగ్రెస్ భావిస్తుంది. ఇదే విషయం టీఆర్ ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది. కేసీఆర్ గడిచిన ఎన్నికల్లో కేవలం 25వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇప్పుడు నర్సారెడ్డి - ప్రతాప్ రెడ్డి కలిస్తే కేసీఆర్ మెజార్టీ పోయి ఓడిపోయే అవకాశాలొస్తాయి. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీని షేక్ చేస్తోందట..
మరోవైపు ఈ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ కీలక - ప్రధాన నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తున్నాయి.. జగదేవ్ పూర్ మండల పరిషత్ చైర్మన్ రేణుకతో పాటు కొంతమంది ఎంపీటీసీలు - సర్పంచులను కాంగ్రెస్ లో చేరారు. వెంటనే రంగంలోకి దిగిన హరీష్ రావు కొంతమంది కాంగ్రెస్ నేతలను టీఆర్ ఎస్ లోకి రప్పించగలిగారు. కానీ, ప్రధాన నేతలు కూడా కారు దిగడానికి సిద్ధమవుతుండటం, ఆ పార్టీకి భారీ నష్టమే జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీబాస్ ను ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్లాన్లు వర్కవుట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ ఓడిపోతారా.? వైరీ పక్షాలన్నీ ఒక్కటైనే వేళ కేసీఆర్ ఏం చేస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది.