Begin typing your search above and press return to search.
టీవీ పులులకు టిక్కెట్ దక్కలేదే..?
By: Tupaki Desk | 16 Nov 2018 7:37 AM GMTతెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీల వారు ఓ విషయంలో ఒకే రకమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. టిక్కెట్లు రాని వారితో పాటు - రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే టీవీల్లో డిబేట్లు నిర్వహించిన వారికి టిక్కెట్లు రాలేదు. షార్ట్ కట్ నేతలను కాంగ్రెస్ - టీడీపీ - టీఆర్ ఎస్ పార్టీలు దూరంగా పెట్టడం.. పార్టీ నేతలకు ఓ హెచ్చరికలా మారింది.
ఎన్నికల వేళ ఉదయం - సాయంత్రం టీవీ చానళ్లలో పార్టీ నేతలతో చర్చలు ఎక్కువయ్యాయి. బుల్లి తెరపై కనబడుతున్నాం కదా.. జనాలు ఇట్టే కనిపెట్టేస్తారు.. నాయకులుగా బతికేయచ్చు అనుకుంటే పొరబడినట్టేనని తేలిపోయింది.
కాంగ్రెస్ పార్టీ తరపున అధికార ప్రతినిధులుగా టీవీల్లో ఎక్కువసార్లు కనిపించిన అద్దంకి దయాకర్ - క్రిశాంక్ - కార్తీక్ రెడ్డిలకు టిక్కెట్లు దక్కలేదు. టీడీపీలో కూడా కోదాడ నేత బొల్లం మల్లయ్య యాదవ్ - అరవింద్ కుమార్ గౌడ్ లకు టికెట్ రాలేదు. టీఆర్ ఎస్ లో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి - కర్నె ప్రభాకర్ ల ఆశలు కూడా గల్లంతయ్యాయి. గతంలో టీవీ కార్యక్రమాల్లో పాల్గొని ఆ తరువాత దూరంగా జరిగిన దాసోజు శ్రవణ్ కు మాత్రం టిక్కెట్టు దక్కింది.
కేవలం డబ్బు - జనాల నోట్లో నానుతున్న వ్యక్తులకు మాత్రమే అన్ని పార్టీల్లో టిక్కెట్లు దక్కాయి. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ద్వితీయ శ్రేణి నేతలను ఆకట్టుకుందామని.. లేదా వారసత్వపు ఫేమింగ్ పనిచేస్తుందని అనుకున్నవారికి టిక్కెట్లు దక్కవని తేలిపోయింది. వర్గాలు కూడగట్టుకునే వారికి - లాబీయింగ్ లు నడిపడంలో నేర్పరులుగా ఉంటేనే పార్టీ టిక్కెట్లు ఇస్తారని పార్టీ ఆఫీసుల్లో చర్చ జరుగుతోంది. అంతేకానీ నోరున్న వారికి టికెట్లు రావని తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ నిరూపితమైంది..