Begin typing your search above and press return to search.
విపక్షాల తాజా టార్గెట్.. ఫైర్ బ్రాండ్ మాత్రమేనట
By: Tupaki Desk | 29 Feb 2016 4:27 AM GMTగంటకు కాస్త తక్కువగా మాట్లాడిన ఆమె మాటలు దేశం మొత్తమ్మీదా సంచలనంగా మారటమే కాదు.. విపక్షాల పరువును నేలపాలు చేసి.. వారు మాట్లాడుతున్న మాటల రాజకీయాల్ని అసహ్యించుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు కేందమంత్రి స్మృతి ఇరానీ. జేఎన్ యూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో చోటు చేసుకున్న ఘటనలు.. ఆ పై వివాదాల గురించి నాన్ స్టాప్ గా లోక్ సభలో మాట్లాడిన స్మృతి దెబ్బకు విపక్షాలు బేజారెత్తిన దుస్థితి. విపక్షాలకు చెందిన నేతలు కొందరు.. స్మృతి ప్రసంగాన్ని కీర్తించేయటమే కాదు.. రాహుల్ గాంధీని విమర్శించారు.
హోల్ సేల్ గా తమ పరువును గంగపాలు చేసిన స్మృతిని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదని పట్టుదలతో ఉన్న విపక్షాలు ఆమెను ఇరుకున పడేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్న వారు.. మూకుమ్మడి దాడితో స్మృతిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
కీలకమైన వార్షిక బడ్జెట్ నేపథ్యంలో సోమవారం సభను సజావుగా సాగనివ్వాలని.. మంగళవారం నుంచి స్మృతి లక్ష్యంగా పని చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశాల్లో పలు అంశాలతో పాటు.. కీలక బిల్లుల్ని ఆమోదించుకోవాలని మోడీ సర్కారు భావిస్తుంటే.. విపక్షాలు మాత్రం అందుకు భిన్నంగా కేందమంత్రిపై ఫైర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ తర్వాత.. ఆమెపై సభాహక్కుల తీర్మానాన్ని పెట్టాలని విపక్ష నేతలు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇన్నాళ్లు తాము వినిపించే వాదనల వెనుకున్న అసలు విషయాల్ని గంట కంటే తక్కువ ప్రసంగంలో చీల్చి చెండాటమే కాదు.. గుట్టును రట్టు చేసిన స్మృతి మీద కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ నేతలకు ఆ మాత్రం కసి.. కోపం ఉండదా..?