Begin typing your search above and press return to search.
వలస కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ..సోనియా కీలక నిర్ణయం!
By: Tupaki Desk | 4 May 2020 3:30 PM GMTప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. ఉన్నచోట ఉండలేక, సొంతూళ్ల కు వెళ్లలేక వలస కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట చేత పట్టుకొని, కాలిబాటన వందల కిలోమీటర్లు నడుస్తూ సొంతూరికి పయనమవుతున్నారు లాక్ డౌన్ అమల్లోకి తెచ్చిన కొన్ని రోజుల నుండే వలస కార్మికుల కాలినడక ఆరంభమైంది. దాదాపుగా సగం మందికి పైగా వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
ఈ తరుణంలో ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రవాణా వసతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వలస కార్మికుల కోసం రైళ్లను నడిపించడానికి అనుమతులను మంజూరు చేసింది. ఈ పరిస్థితుల్లో వలస కార్మికులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. వారి రవాణాకు అవసరమైన ఖర్చులన్నింటినీ భరిస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల రవాణా ఖర్చును ఆ రాష్ట్రానికి చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు భరిస్తాయని వెల్లడించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు సోనియాగాంధీ లేఖ రాశారు. వలస కార్మికులే దేశానికి వెన్నముక అన్నారు. వలస కూలీల కష్టం, త్యాగం మన దేశానికి పునాది అన్నారు. వలస కార్మికుల ప్రయాణ ఖర్చు స్థానిక కాంగ్రెస్ నేతలే భరించాలన్నారు సోనియా. విదేశాల్లో ఉన్న వారిని ఫ్రీగా దేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వాలు... ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికుల్ని ఉచితంగా సొంతూళ్లకు పంపాలేదా అంటూ ఆమె ప్రశ్నించారు.
ప్రభుత్వం వలసకార్మికులని చిన్నచూపు చూస్తుంది అని , కనీస రవాణా వసతిని ఏర్పాటు చేయకుండా.. వారిని వందలాది కిలోమీటర్ల దూరం నడిపించిందని ఆరోపించారు. కేంద్రం వైఖరి వల్లే ఈ దుస్థితిని వారు ఎదుర్కొన్నారని విమర్శించారు. రైల్వే మంత్రిత్వ శాఖ పీఎం కేర్ కు 151 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చిందని, అలాంటిది వలస కార్మికులకు రైళ్లల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించలేక చేతులెత్తేసిందని సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే మరోవైపు వలస కార్మికుల వెతలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడికక్కడ వలస కార్మికులంతా రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. తమను తమ గ్రామాలకు పంపాలంటూ అధికారుల్ని, ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆందోళనకు దిగుతున్న విషయం కూడా తెలిసిందే.