Begin typing your search above and press return to search.

రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌: రాజ్‌ భ‌వ‌న్ ముట్ట‌డి ర‌ణ‌రంగం

By:  Tupaki Desk   |   16 Jun 2022 9:24 AM GMT
రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌:  రాజ్‌ భ‌వ‌న్ ముట్ట‌డి ర‌ణ‌రంగం
X
తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు చేప‌ట్టిన రాజ్‌ భవన్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాహుల్‌గాంధీ ని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగిస్తోంది. ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్‌ భవన్ ముట్టడించేందుకు... నేతలు ప్రయత్నించగా... నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డు పై వాహనాలకు నిప్పు పెట్టిన కాంగ్రెస్ నేతలు... కేంద్ర సర్కార్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం నేతలు ర్యాలీగా... కాంగ్రెస్‌ నేతలు రాజ్‌ భవన్‌ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి... ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ రాజ్‌ భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. ఖైరతాబాద్‌ వద్ద ఆందోళనలకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు... బీజేపీ సర్కార్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసి.. ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు.

బస్సు పైకి ఎక్కి మోదీ సర్కార్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఖైరతాబాద్ కూడలి వద్దకు భారీగా కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావడంతో... రాకపోకలు స్తంభించాయి. అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు... రాజ్‌ భవన్‌ వైపు నేతలు దూసుకెళ్లారు.

ఈ క్రమంలో పోలీసులు- నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాగ్వాదంలో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. బీజేపీ సర్కార్‌ కుట్రపూరితంగానే... రాహుల్‌ గాంధీని ఈడీ విచారిస్తోందని... నేతలు ఆరోపించారు. రాజ్‌ భవన్‌ వైపు ర్యాలీగా వెళ్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, సునీతారావు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా.. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిని గోషామహల్ పీఎస్‌ కు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మహేష్ కుమార్‌ ను పంజాగుట్ట పీఎస్‌ కు తరలించారు.