Begin typing your search above and press return to search.
రేవంత్ వెనకే కాంగ్రెస్ హై కమాండ్...సీనియర్లకు క్లాస్...?
By: Tupaki Desk | 18 Dec 2022 10:30 AM GMTతెలంగాణా కాంగ్రెస్ లో లొల్లి స్టార్ట్ అయింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లుగా ఇపుడు రాజకీయ కధ సాగుతోంది. రేవంత్ రెడ్డితో కలసి పనిచేయలేమన్న స్టేజికి సీనియర్ లీడర్లు చాలా మంది వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి అంటే మొదటి నుంచి గిట్టని జగ్గారెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి లతో పాటు ఇపుడు అంతా బయటపడిపోయారు. రేవంత్ తో కలసి పనిచేస్తున్న సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సైతం ఇపుడు సీనియర్ల క్యాంప్ లో ఉన్నారు.
అలాగే మాజీ మంత్రులు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, మజీ పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి, మధు యాష్కీ వంటి వారు అంతా రేవంత్ రెడ్డి కాదు మాదే ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారు. ఇక వీరంతా వరసబెట్టి సమావేశాలు నిర్వహిస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. దాంతో కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉంది అని అంటున్నారు.
పార్టీలో విభేదాలు ఉంటే తమతో వచ్చి చెప్పాలి కానీ మీడియాతో పంచుకోవడమేంటన్నది హైకమాండ్ అభిప్రాయంగా ఉంది. దాంతో సీనియర్లను మాట్లాడేందుకు రావాలని ఢిల్లీకి హై కమాండ్ పిలిచినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తప్పు ఎవరిది అన్నది కూడా హై కమాండ్ ఆరా తీసేందుకు ఒక నివేదికను కూడా పార్టీ నాయకుడు కేసీ వేణుగోపాల్ ద్వారా కోరుతున్నట్లుగా తెలుస్తోంది
మరో వైపు చూస్తే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ కార్యదర్శులు కొంతమంది హైదరాబాద్ కి రానున్నారు అని అంటున్నారు. వారంతా అసలు వివాదం ఎక్కడ నుంచి మొదలైంది. దానికి దారి తీసిన కారణాలు ఏంటి అన్నది పూర్తిగా పరిశీలించి ఒక నివేదికను తయారు చేసి ఇస్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతున్నా కూడా సీనియర్లు ఎక్కడా తగ్గేది లేదనే అంటున్నారు
ఇక ఈ నెల 29న మరో కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు ఇంకోసారి భేటీ అయి తమ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకుంటారని అంటున్నారు. మరి ఈ భేటీలో ఏమైనా ఢిల్లీ వెళ్ళే విషయం ఆలోచిస్తారా. ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ పెద్దలకు ఏమి చెప్పాలన్నది చర్చిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక చూస్తే తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాలను నేరుగా ప్రియాంకా గాంధీయే చూస్తున్నారు.
ఆమె తెలంగాణా సీనియర్ల తిరుగుబాటుని నిశితంగా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. నివేదిక వచ్చాక ఆమె పూర్తిగా దృష్టి పెడతారు అని తెలుస్తోంది. ఆ మధ్య హైదరాబాద్ వచ్చి తెలంగాణాలో సభ పెట్టిన రాహుల్ గాంధీ కూడా సీనియర్లకు ఇండైరెక్ట్ గానే హెచ్చరికలు జారీ చేసారు. పదవులు తీసుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదు, అందరూ పనిచేయాలని ఆయన ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించదని కూడా రాహుల్ కరాఖండీగా చెప్పారని అంటున్నారు.
ఇపుడు కూడా హై కమాండ్ స్టాండ్ అదేనా అన్నది చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే హై కమాండ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించే విషయం ఏదీ ఆలోచన చేయదని అంటున్నారు. ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఎవరిని పీసీసీ చీఫ్ గా తెచ్చినా కాంగ్రెస్ లో లుకలుకలు అలాగే ఉంటాయని కూడా ఆలోచిస్తోందిట. అందుకే సీనియర్ల అభిప్రాయలను తెలుకుని తాజాగా ప్రకటించిన కమిటీలలో మార్పులు చేర్పులు కొన్ని చేసు సర్దుబాటు చేయడానికే చూస్తారని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది మొదట్లో సుదీర్ఘ పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన తెలంగాణా అంతటా అయిదారు నెలల పాటు పర్యటించే విధంగా తన అజెండాని రెడీ చేసి పెట్టుకున్నారు. దానికి హై కమాండ్ ఆమోదముద్ర ఉంది అంటున్నారు. అంటే కాంగ్రెస్ హై కమండ్ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని చెబుతున్నారు. యువకుడు, చరిష్మా ఉన్న లీడర్ గా రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ పెద్దలు ఉంటూ తెలంగాణా కాంగ్రెస్ విషయంలో సీనియర్లకే నచ్చచెబుతారని అంటున్నారు. మరి అప్పటికీ సీనియర్లు మాట వినకపోయినా నిరసనలు కొనసాగినా ఏమవుతుంది అన్నది మాత్రం తెలియడంలేదు.