Begin typing your search above and press return to search.

భూకంపం ఎపిసోడ్ లో మరికొందరు సీఎంలు

By:  Tupaki Desk   |   26 Dec 2016 5:32 AM GMT
భూకంపం ఎపిసోడ్ లో మరికొందరు సీఎంలు
X
తాను కానీ నోరు విప్పితే.. భూకంపమే అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన భీకర వ్యాఖ్యతో ఆశేష భారతావని బెదిరిపోయింది. ప్రకృతి కన్నెర్నతో కిందా మీదా పడుతున్న దేశ ప్రజలకు.. మోడీలాంటి వారిపుణ్యమా అని నోట్ల రద్దుతో పుట్టించిన మంట చలికాలంలో సెగలు పుట్టిస్తోంది. ఇవన్నీ సరిపోక.. రాహుల్ మళ్లీ నోటి మాటతో రాజకీయ భూకంపం తెచ్చేస్తే ఈ దేశం ఏం కావాలని ఫీలైనోళ్లు ఉన్నారు.

అయితే.. యువరాజు మాటల్లోనే కానీ.. చేతల్లో అంత సీన్ లేదన్న విషయం మరోసారి రుజువైంది. సహారా సంస్థల నుంచి ముడుపులు అందాయని.. అలా అందుకున్న వారిలో నేటి ప్రధాని.. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని.. ఆయనకు రూ.40కోట్లు అందాయంటూ ఆయన ఆరోపించారు. ఆవెంటనే.. ఆ ఆరోపణకు సంబంధించిన చరిత్ర మొత్తం బయటకు రావటమే కాదు.. ఆ కేసుకు సంబంధించి సుప్రీం కూడా తేల్చేసిన వైనం అందరికి తెలిసిపోయి.. రాహుల్ భూకంపం మాటలు మరీ ఇంత ఎటకారంగా ఉంటాయా? అని అనుకునే పరిస్థితి.

జరిగిన రచ్చ చాలదన్నట్లు..ఈ ఇష్యూ మీద మరింత ముందుకెళ్లాలని ఫీలవుతోంది కాంగ్రెస్. మోడీ మీద ఆరోపణలు చేసిన వెంటనే.. తమ పార్టీకే చెందిన ముఖ్యమంత్రుల మీద కూడా ఈ తరహా ఆరోపణలే వచ్చాయని.. మోడీని వేలెత్తిన చేత్తోనే తమ వైపు వేలెత్తి చూపించుకోవాలన్న ఇంగితాన్ని మరిచిన కాంగ్రెస్ తన విమర్శలకు మరింత పదును పెట్టాలని భావిస్తోంది.

ఇందులోభాగంగా.. తాజాగా బీజేపీకి చెందిన మరికొందరు ముఖ్యమంత్రులకు కూడా సహారా ముడుపులు అందించిందని.. ఈ ఇష్యూను తేల్చాలంటూ పట్టుబడుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేస్తూ.. సహారా సంస్థలు.. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు రమణ్ సింగ్.. శివరాజ్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ రియాక్ట్ అవుతూ తన మీద వచ్చిన అవినీతి ఆరోపణల్ని కొట్టిపారేయటమే కాదు.. ఈ ఆరోపణలుచాలా చిత్రంగా ఉన్నాయని.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. కామెడీ కాకపోతే.. ఎవరు మాత్రం తమ మీద వచ్చిన ఆరోపణలు నిజమని.. తాము తప్పు చేశామని చెప్పుకోరు కదా? దీని కంటే.. తమపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరపాలని.. తప్పు చేస్తే శిక్షించాలంటూ సవాల్ చేయటం సబబుగా ఉంటుంది. అయినా.. విడుదలైపోయి అట్టర్ ప్లాప్ అయిన సినిమాకు ఎన్ని కొత్త ట్రైలర్లు రిలీజ్ చేస్తే మాత్రం లాభం ఉంటుంది చెప్పండి..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/