Begin typing your search above and press return to search.
చిరంజీవి, కాంగ్రెస్.. బంధం తెగిందా? ఉందా?
By: Tupaki Desk | 28 Jun 2021 5:30 PM GMTఎరక్కపోయి రాజకీయాల్లోకి వచ్చి అనుభవించి ఇరుక్కుపోయారు. ఆ ఊబీలోంచి చాలా అనుభవాలు, అవమానాలతో చిరంజీవి బయటపడ్డారు. ప్రజారాజ్యం పెట్టి పైసలన్నీ పొగొట్టుకొని పైగా ఎన్నో కష్టాలు నష్టాలు చూసి కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి.. కేంద్రమంత్రి అయ్యి.. పదవీకాలం పూర్తయ్యాక యాక్టివ్ రాజకీయాలకు దూరం అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
ఇప్పటికీ కూడా చిరంజీవి కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదు. అలాగని కాంగ్రెస్ తో అంటకాగడం లేదు. అసలు చిరంజీవి రాజకీయాల నుంచి వైరాగ్యంతో వైదొలగారని అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేకుండా సినిమాల్లో కొనసాగుతున్నారని.. సినిమాలే లోకం తప్పితే కనీసం తన తమ్ముడు పార్టీ 'జనసేన'కు కూడా చిరంజీవి మద్దతు తెలుపడం లేదని అంటున్నారు.
మెగా స్టార్ కు ఇప్పుడు రాజకీయాలంటేనే రొచ్చులా కనిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్, జగన్ తో సాన్నిహిత్యం ఉన్నా.. వారిని కలుస్తున్నా కేవలం సినిమా అవసరాలు, పనుల కోసమే తప్ప వారి పార్టీలో చేరడం లేదు.. వారి తరుఫున వకాల్తా పుచ్చుకోవడం లేదు. కేవలం వారు చేస్తున్న మంచి పనులను అభినందిస్తున్నారు.
అయితే తాజాగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ ఏపీలోని విజయవాడకు వచ్చారు. ఈ సమావేశానికి రావాలని చిరంజీవికి వర్తమానం పంపారట.. ఆయనను నుంచి స్పందన లేదట.. ఇలా ఇప్పటికీ చాలా సార్లు పంపినా చిరంజీవి నుంచి కనీసం రిప్లే లేదు. దీంతో చిరంజీవి ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఉమెన్ చాందీ అధికారికంగా ప్రకటించారు. రాజీనామా చేయకుండా.. కాంగ్రెస్ తో కలవకుండా చిరంజీవి దూరంగా ఉండడం ఆ పార్టీని అవమానించడమేనని అంటున్నారు. చివరకు కాంగ్రెస్ యే విసిగి చిరంజీవి తమ పార్టీ వాడు కాదని ప్రకటించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడన్న మాట.