Begin typing your search above and press return to search.

పాత హీరోయిన్ల పొలిటికల్ ఫైట్

By:  Tupaki Desk   |   17 Oct 2015 9:18 AM GMT
పాత హీరోయిన్ల పొలిటికల్ ఫైట్
X
తమిళనాడు కాంగ్రెస్ లో మాజీ హీరోయిన్ల పరోక్ష పోరు కాస్త వీధికెక్కి రచ్చరచ్చగా మారింది. మహిళా కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా తమిళనాడులో మహిళాకాంగ్రెస్ సమావేశానికి వచ్చిన నగ్మా అక్కడి వివాదాలు పరిష్కరించే ప్రయత్నంలో తానూ వివాదాస్పదమయ్యారు. ప్రతిపాదిత కార్యక్రమాలకూ హాజరుకాకుండా దూరంగా ఉండడంతో విమర్శలకు గురవుతున్నారు.

తమిళనాడు కాంగ్రెస్ లో ఉన్న నటి ఖుష్బూ నగ్మా నియామకం పట్ల వ్యతిరేకంగా ఉన్న సంగతితెలిసిందే. దీంతో మహిళా కాంగ్రెస్ ఇన్ ఛార్జి హోదాలో నగ్మా రాష్ట్రానికి వస్తున్నప్పటికీ ఆమెకు స్వాగతం పలికేందుకు ఎవరూ వెళ్లలేదు. తమిళనాడు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వేసిన ఓ ఆహ్వాన కమిటీ మాత్రమే విమానాశ్రయానికి వెళ్లింది. నాయకులెవరూ లేకుండా ముక్కూ మొఖం తెలియని కార్యకర్తలు వచ్చేసరికి నగ్మా వారి ఆహ్వానాన్ని తిరస్కరించారట. దీంతో వారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయధరణికి వెంటనే ఫిర్యాదు చేయడం... ఆమె నగ్మాతో మాట్లాడడం జరిగాయి. దాంతో నగ్మా మరింత ఆగ్రహించి శుక్రవారం తాను హాజరుకావాల్సిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు.

తమిళనాడు మహిళా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గా నగ్మా నియామకాన్ని కుష్బుతో పాటుగా పలువురు మహిళా నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా ఇన్‌ చార్జ్ ఆమె తొలిసారి రాష్ట్రానికి వస్తున్నా ఎవరూ వెళ్లలేదు. దీంతో నగ్మా ఆగ్రహించింది. అయితే, తమిళ మహిళా కాంగ్రెస్ వర్గాల వాదన మరోలా ఉంది. నగ్మా ఓవర్ చేశారని... ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంతో తమిళనాడులో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వాయిదా పడిపోయింది. ఆ కార్యక్రమానికే నగ్మా రాగా అంతా రచ్చరచ్చగా మారి విషయం అధిష్ఠానం వరకు వెళ్లబోతోంది.