Begin typing your search above and press return to search.
టీ.కేబినెట్ లోకి కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే..?
By: Tupaki Desk | 27 Feb 2019 4:27 AM GMTతెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో రెండోసారి గులాబీ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఇటీవల 10 మందితో రాష్ట్ర కేబినేట్ ను కూడా కేసీఆర్ విస్తరించారు. అయితే తొలి కేబినేట్‌లో ఒక్క మహిళకూ ఛాన్స్ రాలేదు. రెండోసారైనా వస్తుందని ఆశించిన వారికి మొదటి 10 మందిలో చోటు దక్కలేదు. కానీ వచ్చే విస్తరణలో ఇద్దరు మహిళా మంత్రులు ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్ పై హాట్ చర్చ సాగుతోంది. మరి తెలంగాణ ప్రభుత్వంలో తొలిసారి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టేవారెవరు..?
రాష్ట్రంలో రెండోసారి విజయం సాధించాక టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ముందుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు హోంమంత్రిగా మహ్మద్ అలీ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు నెలల తరువాత కేబినేట్ ను విస్తరించి 10 మందికి అవకాశం ఇచ్చారు. అయితే ఇందులో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. టీఆర్ ఎస్ తరుపున ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందినా కేబినేట్ లో చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేబినేట్ లోనైనా మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన కేసీఆర్ తరువాతి విస్తరణలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామన్నారు.
దీంతో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నెలకొంది.ఇటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చెప్పిన ఎమ్మెల్యేల్లో ఏపార్టీకి చెందిన వారికి అవకాశం ఇస్తారోనని రకకాలుగా చర్చించుకుంటున్నారు. టీఆర్ ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు - ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే టీఆర్ ఎస్ లోని నలుగురిలో ఇద్దరికి మంత్రిపదవి ఇస్తారా..? లేక కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి పార్టీలోకి చేర్చుకొని కేబినేట్ లోకి తీసుకుంటారా..? అని చర్చ మొదలైంది. కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి - సీతక్కలు సీనియర్ నాయకులు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి గులాబీ కండువా కప్పి మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ లో చర్చించుకుంటున్నారు. అప్పట్లోనే సబితా గులాబీ పార్టీలో చేరి చేవెళ్ల నుంచి పోటీచేద్దామని భావించారు. కానీ ఆమె కుమారుడి వల్ల కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఈమె టీఆర్ ఎస్ లో చేరితే మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ టీఆర్ ఎస్ కేబినేట్ లో ఇద్దరు మహిళా మంత్రులు ఉంటారట.. అది మేము కాదులే..? అని వ్యాఖ్యానించారు. దీనిపై ఓ సినీయర్ నాయకుడు సీతక్క తప్పకుండా సెంట్రల్ మినిస్టర్ అవుతుందని వ్యాఖ్యానించారు. దీంతో సీతక్కకు మహబూబాబాద్ ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. సహజంగా ముఖ్యమంత్రి కేబినేట్ ప్రకటన చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరగాలి. కానీ ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేల మధ్య కామెంట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.