Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు మంచిరోజులు వచ్చినట్లేనా..?
By: Tupaki Desk | 5 Nov 2021 5:08 AM GMTఅనుకున్నట్లే కాంగ్రెస్ కు మంచిరోజలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఏడేళ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఉనికి ఏమాత్రం కనిపించలేదు. కనీసం మున్సిపల్ స్థాయి ఎన్నికల్లోనూ హస్తం హవా ఏమాత్రం లేదుు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూస్తే మాత్రం కాంగ్రెస్ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. గతనెల 30న దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే గతేడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మోదీ వీరోచితంగా పోరాడిని అక్కడి ప్రజలు ఆదరించలేకపోయారు. దీంతో అప్పటి నుంచి మోదీ గ్రాఫ్ తగ్గిపోతుందని పలు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. దీంతో ఇక కాంగ్రెస్ అధికారం వైపు వెళ్తుందా..? అన్న చర్చ సాగుతోంది.
నవంబర్ 30న దేశ వ్యాప్తంగా 29 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ గెలుచుకుంది. కేంద్రం,రాష్ట్రంలో బీజేపీ ఆధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే పరిస్థితులు మారుతున్నాయని అర్థం చేసుకోవచ్చని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్ సభ స్థానంలో బీజేపీకి బలం విపరీతంగా ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయినా పోటీని తట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లోని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవలే ఇక్కడ యడ్యూరప్ప సీఎం ఉండగాన ఆయన స్థానంలో బస్వరాజు బొమ్మెను నియమించారు. అయితే దీని ప్రభావమో.. లేక ఇతర కారణమో తెలియదు గానీ.. ఈ రాష్ట్రంలో జరిగిన రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది. మరోవైపు హర్యానా రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి గెలిచారు. కానీ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. దాద్రానగర్ హవేలీ ఎంపీ స్థానంలో శివసేన అభ్యర్థి గెలిచారు. అయితే ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నవే. దీంతో కాంగ్రెస్ ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నట్లు చర్చించుకుంటున్నారు.
మొత్తంమీద బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ దూసుకు పోతుంది. పరిస్థితులు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఏమాత్రం కష్టం కాదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు అభిమానం ఉన్న పార్టీలోని నాయకుల మధ్య గ్రూపు విభేదాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఇదే నవంబర్ 30న తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే గ్రూపు విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను కొందరు సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి నియామకం నుంచి కొమటి రెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు గాంధీ భవన్ మెట్లెక్కలేదు. ఈ పరిస్థితిని గమనించే హుజూరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.
అయితే మోదీ అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. మొన్నటి వరకు పెట్రోల్ ధరలు పెరుగుంటూ చూస్తు కూర్చున్న మోదీ ఇది అంతర్జాతీయ సమస్య అన్నారు. కానీ దీపావళి గిప్ట్ అని ఎక్సైజ్ సుంకం తీసేసినట్లు ప్రకటించారు. దీంతోపెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో కొన్ని రాష్ట్రాలు కూడా పన్నును తగ్గిస్తున్నట్లు తెలిపాయి. అంటే మోదీకి ఎదురు దెబ్బ తగలగానే పెట్రోల్ రేట్లు తగ్గించారని, ఇప్పుడు అంతర్జాతీయ సమస్య కాదా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.