Begin typing your search above and press return to search.
హిందూ సీఎం కార్డ్ ప్రయోగిస్తున్న కాంగ్రెస్!
By: Tupaki Desk | 2 July 2019 12:15 PM GMT'మాకు మెజారిటీ సీట్లు ఇవ్వండి.. హిందువును ముఖ్యమంత్రిని చేస్తాం..' అని అంటోంది కాంగ్రెస్ పార్టీ! ఇలా గ్రాండ్ ఓల్డ్ పార్టీ 'హిందూ సీఎం' కార్డ్ ను ప్రయోగిస్తూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది. ఉన్నట్టుంది కాంగ్రెస్ ఈ రాజకీయం చేస్తోందేమిటి.. అంటే ఇదంతా జమ్మూ కశ్మీర్ వ్యవహారం.
అక్కడ రాష్ట్రపతి పాలనను కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలల తర్వాత అయినా అక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇప్పటి నుంచినే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్టుగా ఉంది.
అందులో భాగంగా జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్ ఇలా ప్రచారం చేసుకుంటోంది. టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ నేతలు ఈ మాట చెబుతూ ఉన్నారు. జమ్మూ ప్రాంతంలో తమకు మెజారిటీ ఎమ్మెల్యే సీట్లను ఇవ్వాలని తాము హిందువును ముఖ్యమంత్రిగా చేయబోతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
జమ్మూ అండ్ కశ్మీర్ కు హిందువు ముఖ్యమంత్రి కావాలంటే జమ్మూలో తమకే మెజారిటీ సీట్లను ఇవ్వాలని వారు ప్రజలను కోరుతున్నారు. జమ్మూలో హిందూ జనాభా గణనీయంగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుందని పరిశీలకులు అంటున్నారు. అయితే బీజేపీ వాళ్లు కాంగ్రెస్ ను నమ్మవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.