Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: ప్రతీకారానికి ముక్కే ఆయుధం

By:  Tupaki Desk   |   31 Jan 2020 9:17 AM GMT
ట్రెండింగ్: ప్రతీకారానికి ముక్కే ఆయుధం
X
సీమ ఫ్యాక్షనిజం ఒకప్పుడు ట్రెండింగ్.. కత్తులతో వేటాడి కసితీరా చంపేయడం ఫ్యాక్షనిస్టుల ఫ్యాషన్. ఇక సీమ బయట కోపాన్ని కొట్టడం ద్వారానో.. తిట్టడం ద్వారానో కోపిస్టులు తగ్గించుకుంటారు. కానీ ఇప్పుడంతా ముక్కుపై పడ్డారు. అవును సమాజంలో ముక్కు టార్గెట్ గా కోపిస్టులు రెచ్చిపోతున్నారు. వరుసగా ప్రత్యర్థుల ముక్కులు కొరికేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. తెలంగాణ సహా ఇటీవల వరుసగా ఈ ముక్కులు కొరుకుడు ఉదంతాలు బయటపడడం వైరల్ గా మారింది.

అప్పట్లో చైనాలో తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భార్య ముక్కు కొరకడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నాం. తాజాగా హైదరాబాద్ లోనూ ప్రాణ స్నేహితుడు డబ్బులు ఇస్తానని మోసం చేయడంతో కోపోద్రిక్తుడైన బాపూనగర్ కు చెందిన రమేష్ .. తన స్నేహితుడైన బల్కంపేటకు చెందిన వేణు ముక్కును కసితీరా కొరికేశాడు. వేణు ముక్కు కండ మొత్తం ఊడిపోయింది పాపం ముక్కు లేకుండా పోయింది. ప్రస్తుతం వేణు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి ఉదంతమే చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఓటింగ్ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి ఇలాయిస్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కు కొరికేయడం విశేషం.

ఇలా సమాజంలో ఇప్పుడు ముక్కు కొరకడం ట్రెండింగ్ గా మారింది. మున్ముందు ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి మరి.