Begin typing your search above and press return to search.
జగన్‌కు నిరసన తెలిపిన ఆ కానిస్టేబుల్ డిస్మిస్!
By: Tupaki Desk | 29 Aug 2022 7:30 AM GMTఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి పోలీసులకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఈ ఏడాది జూన్ 14న అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల్లోంచి తొలగించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 14న శ్రీసత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆరోజు ప్రకాశ్ అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద.. ప్రభుత్వం పోలీసుల బకాయిలు చెల్లించాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు. ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్. గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ ఎరియర్స్. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ ఆ ప్లకార్డుపై పేర్కొన్నారు. దాన్ని పట్టుకుని కూర్చుని తన నిరసన తెలిపారు.
దీంతో ప్రభుత్వం ఎస్‌ఎల్‌ఎస్‌లు, టీఏ బకాయిలను మరుసటి రోజే పోలీసుల ఖాతాల్లో వేసింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రకాశ్‌కు మద్దతుగా నిలవడంతో కొన్నిరోజుల పాటు ఏ చర్యలూ తీసుకోలేదు. అయితే ప్రకాశ్ పై నిఘా పెట్టారని వార్తలు వచ్చాయి. ఫోన్ కాల్స్ పైనా నిఘా ఏర్పాటు చేశారు.
ప్రకాశ్ తన ఇంటి నుంచి బయటకు రాకుండా కొన్నిరోజుల పాటు ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టారు. అంతేకాకుండా అతడి బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేశారు. నిరసన తెలిపారన్న కారణంతో జిల్లా కేంద్రానికి దూరంగా డ్యూటీ వేశారు. నిరసన తెలిపినందుకు, గతంలో 2019లో నమోదైన ఓ కేసులో ఒకేరోజు మూడు నోటీసులు ఇచ్చి కక్షసాధింపు చర్యలకు దిగారని విమర్శలు వచ్చాయి.
అయితే సీఎం జగన్ కు నిరసన తెలిపినందుకు అన్నట్టు కాకుండా 2019లో అనంతపురం జిల్లా గార్లదిన్నెలో కానిస్టేబుల్‌పై నమోదైన ఓ కేసులో అభియోగం రుజువైందంటూ ప్రకాశ్ ను డిస్మిస్ చేయడం గమనార్హం. కాగా కానిస్టేబుల్ ప్రకాశ్ ఈ నెల 24న మెడికల్ లీవ్ పెట్టి సొంతూరు కదిరికి వెళ్లగా ఆయనను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతపురం డీపీవోలో ప్రకాశ్ నివాసముంటున్న క్వార్టర్‌లోని ఇంటి తలుపునకు అధికారులు ఈ డిస్మిస్ ఉత్తర్వులు అంటించారు.
కాగా కానిస్టేబుల్ ప్రకాశ్‌పై నమోదైన కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2019 జూన్ 22న అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి గార్లదిన్నెకు చెందిన బి.లక్ష్మి అనే వివాహిత వచ్చారు. డీపీవోలో పనిచేస్తున్న ప్రకాశ్ తనతో పరిచయం పెంచుకున్నారు.. తనను ప్రేమిస్తున్నానంటూ మోసం చేశారని ఫిర్యాదు చేశారు.
తన నుంచి ప్రకాశ్ రూ.10 లక్షలు నగదు, 30 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నారని ఆరోపించారు. తనను చంపడానికీ ప్రయత్నించినట్లు కూడా పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణలో ఇవన్నీ రుజువు కావడంతో ప్రకాశ్‌ను డిస్మిస్ చేశామని ఎస్సీ ఫక్కీరప్ప చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.