Begin typing your search above and press return to search.
వీణావాణి..ఇక ఎప్పటికీ అవిభక్త కవలలేనా?
By: Tupaki Desk | 1 Jan 2017 10:26 AM GMTవీణావాణి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అవిభక్త కవలుగా ఉండి వారు అనుభవిస్తున్న వేదన అంతా ఇంతా కాదు. వారిని వేరు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న వారిద్దరినీ తాజాగా స్టేట్ హోంకు తరలించారు. అయితే.. ఇలా తరలించే ముందు ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడం వివాదంగా మారింది.
వీణావాణిలు పుట్టినప్పటి నుండి నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. చికిత్స కోసం కొంతకాలంపాటు ఇతర ప్రాంతాలకు తరలించినా , చివరికి వీణావాణిలకు నీలోఫర్ ఆసుపత్రే ఇల్లుగా మారింది. వారి తల్లిదండ్రులు కూడ అప్పుడప్పుడూ ఈ ఆసుపత్రికి వచ్చి వీణా వాణిలను చూసి వెళ్తుంటారు. ఊహ తెలిసినప్పటి నుండి నీలోఫర్ ఆసుపత్రిలోనే వీణావాణిలు ఉంటున్నారు. అవిభక్త కవలలైన వీణా వాణిలను విడదీసేందుకు పలు రకాల ప్రయత్నాలు జరిగాయి. శస్త్రచికిత్స చేస్తే కొన్ని సమయాల్లో వారి ప్రాణాలకు ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని కొందరు వైద్యులు హెచ్చరించారు.
సరైన నిపుణులతో వారికి శస్ర్త చికిత్స చేయించి విడదీయాలని తెలంగాణ ప్రభుత్వం అనుకున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈలోగా వారిని స్టేట్ హొంలోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగష్టులోనే నిర్ణయం తీసుకొంది. వీణా వాణిలను శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా - లండన్ అస్ట్రేలియా చెందిన వైద్యులు ముందుకు వచ్చినా రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. దీంతో ప్రభుత్వం శస్ర్ర చికిత్స నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని వారిని స్టేట్ హోంకు తరలించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/