Begin typing your search above and press return to search.
కన్నాట్ ప్లేస్.. తన స్థానాన్ని నిలుపుకుంది!
By: Tupaki Desk | 11 July 2019 4:38 AM GMTప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయాల ప్రాంతాల్లో దేశ రాజధానిలో కీలకమైన కన్నాట్ ప్లేస్ తన సత్తాను చాటింది. ప్రపంచంలో టాప్ టెన్ అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కన్నాట్ ప్లేస్ ఒకటిగా నిలిచినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
ఈ జాబితాలో తొలిస్థానాన్ని హాంకాంగ్ లోని సెంట్రల్ డిస్ట్రిక్ వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. ఇక్కడ చదరపు అడుగుకు ఏడాది అద్దె 322 అమెరికన్ డాలర్లు (మన రూపాయిల్లో చెప్పాలంటే సుమారు 22వేలు) తేల్చారు. తర్వాతి స్థానం లండన్ నిలువగా.. ఐదో స్థానంలో చైనా రాజధాని బీజింగ్ నిలిచింది. ఇక.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ తొమ్మిది స్థానాన్ని సొంతం చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ తమ ఫ్రంట్ ఆఫీసులను ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఆఫీసులతో వీటి విలువ అంతకంతకూ పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ లో చదరపు అడుగుకు ఏడాదికి 144 అమెరికన్ డాలర్లుగా అంచనా వేశారు.
దేశీయంగా చూస్తే ఢిల్లీ ప్రధాన మార్కెట్ కావటంతో ఢిల్లీకి అత్యధిక ప్రాధాన్యత లభించిందని చెబుతున్నారు. దేశంలో ఢిల్లీ కన్నాట్ ప్లేస్ తర్వాత ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్.. నారిమన్ పాయింట్ నిలిచాయి. ఇవి సదరు జాబితాలో 27వ స్థానాన్ని.. 40 స్థానంలో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే గత ఏడాది ఇవే ప్రాంతాలకు వచ్చిన ర్యాంకులతో పోలిస్తే.. ఈసారి ర్యాంక్ స్వల్పంగా దిగజారటం గమనార్హం. గత ఏడాది బాంద్రా కుర్లాకు 26వ స్థానంలో నిలిస్తే.. నారీమన్ పాయింట్ 37వ స్థానంలో ఉన్నాయి.