Begin typing your search above and press return to search.
చెలియా సినిమా సీన్ రియల్ అయ్యింది!
By: Tupaki Desk | 28 Feb 2019 5:03 AM GMTఈ మధ్యన మణిరత్నం తీసిన చెలియా సినిమాను చూశారా? అందులో కార్తీక్ హీరోగా నటించారు. వైమానిక దళానికి చెందిన పైలెట్ గా ఆయన నటించారు. ఆ సినిమా మొదటి సీన్.. కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని పాక్ సేనలు కూల్చేస్తాయి. దీంతోనే మూవీ మొదలవుతుంది.
సినిమాలో పైలెట్ గా వ్యవహరించిన హీరో కార్తీక్ విమానం నుంచి ప్యారాచూట్ లో ఎగ్జిట్ అయి కిందపడిపోతాడు. పాక్ ఆర్మీ అతడ్ని చుట్టుముట్టి యుద్ధ ఖైదీగా పట్టుకుంటుంది. ఈ సీన్ తీయటానికి మణిరత్నం.. భారత వైమానిక దళం గురించి తెలుసుకోవటానికి సంప్రదించింది ఎవరినో తెలుసా?.. సింహకుట్టి వర్దమాన్. అతను ఎవరో కాదు.. తాజాగా పాక్ దళాలకు చిక్కిన పైలెట్ అభినందన్ వర్దమాన్ తండ్రి.
ఒక సినిమా లో సీన్ కోసం పని చేసిన తండ్రి.. ఆ సినిమా సీనే రియల్ లైఫ్ లో రిపీట్ కావటానికి మించిన దురదృష్టం ఏముంటుంది? చెలియా సినిమా విడుదల సమయంలో మాట్లాడిన సింహకుట్టి.. తాను మణిరత్నం సినిమా ప్రాజెక్టులో భాగస్వామిని అవుతానని కలలో కూడా ఊహించలేదని.. భారత వైమానిక దళ కథలు వెండితెర మీద ఎప్పుడు కనిపించలేదని.. అందుకే తాను ఆ ప్రాజెక్టుకు సాయం చేసినట్లు పేర్కొన్నారు.
తాను చెలియా సినిమాలో ఏ సీన్ కోసం మణిరత్నానికి సాయం చేశారో.. ఈ రోజున రియల్ గా అలాంటి సీనే తన కొడుకు విషయంలో రిపీట్ కావటం నిజంగానే విధి వైచిత్రిగా చెప్పక తప్పదు. పాక్ యుద్ధ విమానాన్ని తరిమికొడుతూ.. పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లటం.. ఆయన విమానాన్ని పాక్ లో కూలిపోవటం.. ఆ సమయంలో అందులో నుంచి సేఫ్ గా ఎగ్జిట్ అయిన అభినందన్ వర్దన్.. పాక్ ఆర్మీకి చిక్కటానికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది.