Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు ఎవరైనా రాజకీయాలు నేర్పండయ్యా..
By: Tupaki Desk | 4 March 2018 4:32 PM GMTదశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు రాజకీయం చేయడం మర్చిపోతున్నట్లుంది. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోవడమే కాదు రాజకీయ పక్షాల నమ్మకమూ సాధించలేకపోతోంది. అందుకే... ఎక్కువ సీట్లు సాధించినా అధికారం అందుకోలేక చతికిలబడుతోంది. ఇప్పటికే గోవా - మణిపుర్ రాష్ట్రాల్లో ఇలాంటి అనుభవాలను చవిచూసిన కాంగ్రెస్ తాజాగా మేఘాలయలోనూ బీజేపీ పాలి‘ట్రిక్స్’ ముందు దిక్కులు చూస్తూ నిల్చుంది. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.
మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ అందరికంటే అత్యధిక సీట్లు సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మాత్రం విఫలమైంది. భాజపా అక్కడి పార్టీలన్నిటికీ దార్లోకి తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని కూడగట్టుకోవడం సఫలీకృతమైంది. హంగ్ ఏర్పడిన రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందోననే ఉత్కంఠకు తెరతీస్తూ భాజపా భాగస్వామిగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. ఎన్ పీపీకి భాజపా - యూడీఎఫ్ - పీడీఎఫ్ - హెచ్ ఎస్ పీడీపీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ పీపీ అధ్యక్షుడు కన్రాద్ కె. సంగ్మా తన మద్దతుదారులతో కలిసి గవర్నర్ గంగా ప్రసాద్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాల్సిందిగా ఆయన కోరారు. అందుకు గవర్నరు ఆమోదం తెలిపారు. మార్చి 6న ఉదయం 10.30కి మేఘాలయా సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అంతకుముందు యూడీపీ భాజపా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై యూడీఎఫ్ అధ్యక్షుడు డొంకుపార్ రాయ్ స్పందించారు. ‘ కాంగ్రెస్ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాం. ప్రభుత్వ ఏర్పాటుపై కూలంకషంగా చర్చలు జరిపాం. కన్రాద్ సంగ్మా ఆధ్వర్యంలో ఎన్‌పీపీ -భాజపా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మేం అంగీకారం తెలిపాం. కూటమి నేతగా సంగ్మాను ఎన్నుకున్నాం’ అని ఆయన ప్రకటించారు.
అంతకుముందు యూడీపీ మద్దతు కోసం బీజేపీ - కాంగ్రెస్ లు రెండూ ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ నేతలు - బీజేపీ కీలక నేతలు ఒకేసారి యూడీపీ నేత డొంకుపారా రాయ్ ను సంప్రదించారు. అయితే.. అసోం మంత్రి - ఈశాన్యాన బీజేపీ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న హిమంత విశ్వ శర్మ రాజకీయం నెరపి యూడీపీతో ఎన్పీపీకి మద్దతు పలికించి కమ్రాద్ సంగ్మా సీఎం కావడానికి మార్గమేర్పరిచారు.
కాగా ఈ పరిణామాలన్నీ మణిపూర్ - గోవాల్లో జరిగిన రాజకీయాన్ని గుర్తు చేస్తున్నాయి. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మణిపూర్ - గోవాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. మణిపూర్‌లో కాంగ్రెస్ 28 స్థానాలను గెలుచుకున్నా అధికారాన్ని అందుకోలేకపోయింది. భాజపా 21 స్థానాలు దక్కించుకొని ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గోవాలోనే ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ కూడా కాంగ్రెస్ 17సీట్లు రాగా.. భాజపా తక్కువ స్థానాల్లో విజయం సాధించిన ఇతర పార్టీల మద్దతుతో మనోహర్ పారికర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పడు మేఘాలయాలోను అదే సీను రిపీటైంది.