Begin typing your search above and press return to search.
నా ఓటమికి అలాంటి కుట్ర చేశారు: కమల్ హాసన్
By: Tupaki Desk | 13 May 2021 3:30 AM GMTప్రముఖ దక్షిణాది హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. తను పోటీచేసిన చోట కూడా గెలవలేకపోయారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
పార్టీలోని కలుపు మొక్కలను ఏరివేసేందుకు నాకు ఎలాంటి మొహమాటం లేదని.. తప్పు చేసే వారిని పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఓ ప్రకటన జారీ చేశారు.
కలుషితమైన ప్రస్తుత రాజకీయాల్లోని ఇతర పార్టీలకు విరుద్ధంగా విభిన్నంగా మక్కల్ నీది మయ్యిం పార్టీని ఏర్పాటు చేసినట్లు కమల్ హాసన్ తెలిపారు. పేదల ప్రజల సంక్షేమమే నా పార్టీ సిద్ధాంతం అని అన్నారు. దానికోసం కట్టుబడి ఉంటామన్నారు. అందుకు ఎంతవరకైనా వెళ్తామని.. పార్టీలో యువకులకు మహిళలకు పెద్ద పీట వేస్తాం అని కమల్ హాసన్ అన్నారు. మరో రెండు వేల మంది ఓటు వేసి ఉంటే నేను తమిళనాడు అసెంబ్లీలో చరిత్ర సృష్టించేవాడిని అని కమల్ అన్నారు.
నీతిమయమైన రాజకీయాల కోసం పోరాటం చేద్దామని.. పార్టీ పున: నిర్మాణం కోసం పాటుపడుదాం అని అన్నారు. విజయం అనేది ఓ మాట కాదు అని.. సాధన, నిరంతరం కృషి వల్లే సాధ్యం అవుతుందని కమల్ అన్నారు.
పార్టీపై బురదజల్లే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను అని కమల్ హాసన్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో ఉత్సాహం కనపడుతున్నదని.. ఓటమి తర్వాత కూడా కార్యకర్తలు బలంగా పనిచేస్తున్నారన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని కమల్ ట్వీట్ చేశారు.