Begin typing your search above and press return to search.
అవి ఏలియన్లా?... మేఘాలా?
By: Tupaki Desk | 9 Sep 2017 7:18 AM GMTఅసలు సౌర కుటుంబంలో భూమిపై కాకుండా మిగిలిన ఏ ఒక్క గ్రహంలోనైనా జీవం ఉందా? ఉంటే... సదరు గ్రహాలపై ఉన్న జీవులు ఎలా ఉంటాయి? భూ గ్రహంపై ఉన్న మానవులనే పోలి ఆ గ్రహాలపై కూడా జీవులు ఉంటాయా? అయినా జీవ కణం ఒక్క భూమికే పరిమితమా?... ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. అన్నింటికీ ఇప్పటిదాకా స్పష్టమైన సమాధానం లేదనే చెప్పాలి. అయితే ఈ సమాధానాలను కనుగొనేందుకు అమెరికా సహా పలు దేశాలు తమ శక్తి మేర పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఈ పరిశోధనలు ఫలిస్తే... ఇతర గ్రహాలపై కూడా జీవ కణం ఉందని తేలితే... అప్పుడు గ్రహాంతర వాసులు ఎలా ఉంటారో తెలుస్తుంది. అప్పటిదాకా ఈ ప్రశ్నలన్నీ శేష ప్రశ్నలే.
ఇతర గ్రహాలపై జీవరాశి ఉందా అన్న కోణంలో జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎన్ ఎస్) ఇప్పటికే తనవంతుగా కృషి చేస్తోంది. ఈ కృషిలో భాగంగా ఇప్పుడో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్ద కొన్ని ఆకారాలు అలా గాల్లో తేలుతూ వెళ్లిన వీడియో ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. కాన్ స్ఫిరసీ థియరిస్టులు బ్రెట్ - బ్లేక్ లు తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసిన ఈ వీడియోలో ఏవో కొన్ని ఆకారాలు అలా గాల్లో తేలుతూ ముందుకు సాగాయి. ఈ ఆకారాలు అటు కాన్ స్పిరసీ థియరిస్టులతో పాటు జనాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయనే చెప్పాలి. ఐఎన్ ఎస్ మీదుగా గాల్లో తేలుతూ వెళుతున్న సదరు ఆకారాలు గ్రహాంతర వాసులవేనని కొందరు వాదిస్తుంటే... కాదు కాదు అవి మేఘాలని మరికొందరు వాదిస్తున్నారు.
అవి నిజంగా ఏలియన్లో - కాదో తెలియదు గానీ... ఈ వీడియో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. కాన్ స్ఫిరసీ థియరిస్టులు బ్రెట్ - బ్లేక్ లు మాత్రం... సదరు ఆకారాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కిందుగా వింత ఆకారాలు ప్రయాణిస్తున్న సమయంలో వీడియో తీశామని చెబుతున్నారు. అయితే ఆ ఆకారాలు ఏమిటో మాత్రం తాము చెప్పలేమని కూడా వారు పేర్కొన్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన కొందరు శాస్త్రవేత్తలు అవి ఏలియన్లు కాదని, ఆకాశంలో మనకు కనిపించే మేఘాలేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఐఎన్ ఎస్ మీదుగా గాల్లో తేలుతూ వెళుతున్న ఈ ఆకారాలపై మాత్రం ఇప్పుడు పెద్ద చర్చకే తెర లేసిందనే చెప్పాలి.