Begin typing your search above and press return to search.

కమలా హ్యరిస్ హత్యకు కుట్ర.. ప్లాన్ చేసింది ఎవరంటే?

By:  Tupaki Desk   |   17 Sep 2021 4:30 AM GMT
కమలా హ్యరిస్ హత్యకు కుట్ర.. ప్లాన్ చేసింది ఎవరంటే?
X
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ హత్యకు సంబంధించిన ఒక కుట్ర బయటకు వచ్చింది. ఒక మహిళ ఇందుకు ప్లాన్ చేయటం గమనార్హం. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించటంతో హత్య కుట్రను భగ్నం చేశారు. ఆమెను జైలుకు పంపారు. ఈ వార్త అమెరికాలో కలకలాన్ని క్రియేట్చేసింది. దేశ ఉపాధ్యక్షురాలిని హత్య చేసుకునేందుకు దాదాపు రూ.39 లక్షల మేర సుపారీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దక్షిణ ప్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నివియన్ పెటిట్ ఫెల్ప్స్ ఫిబ్రవరిలో కమల హత్యకు కుట్ర పన్నారు. ఇందుకోసం ఆమె ఒకరితో భారీ సుపారీని తీసుకున్నారు. యాభై రోజుల్లో హత్య చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుతూ వీడియో తీసుకున్నారు. అయితే.. ఈ వీడియోను ఆమె ఇతరులకు పంపారు. కమల హ్యారీస్ ను హత్య చేస్తానని ఆరుసార్లు వార్నింగ్ లు పంపారు.

కమలా హ్యారీస్ ను ఎలా చంపుతానన్న విషయానికి సంబంధించిన వీడియోల్ని తనకు తాను తీసుకుంటే.. మరికొన్నింటిని ఆమె పిల్లలు రికార్డు చేశారు. వీడియోలతో పాటు.. పిస్టల్ పట్టుకున్న ఒక ఫోటోను భర్తకు పంపింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గన్ లైసెన్సు కోసం ఆమె అప్లికేషన్ పెట్టుకున్నారు. తుపాకీ లైసెన్సు కోసం అప్లికేషన్ చేయటంతో సంబంధిత అధికారులు దర్యాప్తు కోసం ఆమె ఇంటికి వెళ్లారు. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో షాక్ తిన్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు అధికారులు కానీ రాకపోయి ఉంటే..ఏం జరిగేదో తనకు తెలియదని నివియేన్ వారితో చెప్పటం.. నేరాన్ని అంగీకరించటంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసు కోర్టు ముందుకు వచ్చింది. తన నేరాన్ని అంగీకరించిన ఆమెకు నవంబరు 19న శిక్ష ఖరారు చేయనున్నారు. న్యాయ నిపుణుల అంచనా ప్రకారం.. కనీసం ఐదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.