Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు కుట్ర?.. ఆఫ్రికా నుంచి కిరాయి గుండాలు?

By:  Tupaki Desk   |   2 March 2022 6:33 AM GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు కుట్ర?.. ఆఫ్రికా నుంచి కిరాయి గుండాలు?
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఓ వైపు శాంతి చర్చలు నిర్వహించినా.. అవి విఫలం కావడంతో రష్యా యధావిధిగా యుద్ధం కొనసాగిస్తోంది. అయితే ఉక్రెయిన్ రష్యా ధాటికి ఎదురొడ్డి నిలుస్తున్నా.. తీవ్ర నష్టాన్ని పొందుతోంది.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ని అదుపులోకి తీసుకోవడమే లక్ష్యంగా రష్యా ముందుకెళ్తోంది. అయితే తాను యుద్ధానికి భయపడడని, సైనికులతో చేరిన ఫొటోలు కొన్ని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వచ్చాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ని హత్య చేసేందుకు రష్యా కుట్ర పన్నుతోందన్న వార్త కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ వాగ్నర్ గ్రూప్ బయటపెట్టింది.

రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఓ వైపు రష్యా అణ్వాయుధాలు రెడీ చేయాలని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ చుట్టూ రష్యా సైనిక బలగాలు చుట్టుముట్టడంతో ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతోంది.

అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్త కలకలం రేపుతోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ వాగ్నర్ గ్రూప్ కథనం ప్రకారం ఆఫ్రికా నుంచి కిరాయి గుండాలను తీసుకొచ్చిందని తెలిపింది. ఈ కిరాయి గుండాలు జనవరిలోనే ఉక్రెయిన్ చేరుకున్నారని, వారిలో 400 మంది బెలారస్ నుంచి కీవ్ వైపు వెళ్లారని తెలిపింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడికి హత్య చేసేందుకు వీరంతా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని వివరించింది. అయితే ఇటీవల శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రణాళికను రష్యా వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఒకవేళ యుద్ధం ఇలాగే కొనసాగితే మళ్లీ ప్లాన్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొంది. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో పాటు మరో 22 మందిని కూడా హత్య చేయనున్నట్లు సంచలన విషయం తెలిపింది. ఇందులో కీవ్ మేయర్ కూడా ఉన్నట్లు చెప్పింది. పుతిన తన వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తారని ఆ వార్తా సంస్థ తెలిపింది. అయితే వాగ్నర్ గ్రూప్ సంస్థ ను పుతిన్ సన్నిహితుతు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఇదివరకే తనపై హత్య కు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను చంపేందుకు రష్యా ప్లాన్ వేస్తోందని అన్నారు. ఇప్పడు తాజాగా ఈ వార్తా సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేయడం సంచలనంగా మారింది.

జెలెన్ స్కీని హత్య చేసి ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవాలని పుతిన్ చూస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే యుద్ధం కొనసాగింపుతో పాటు అణ్వాయుధాలు సిద్ధం చేయాలని పుతిన్ వ్యాఖ్యలు చేయడంతో పాటు జెలెన్ స్కీ హత్య విషయం మరింత చర్చకు దారి తీస్తోంది.