Begin typing your search above and press return to search.
అమర్ సింగ్ ఆవేదన..నాకే ఎందుకు ఇలా?
By: Tupaki Desk | 1 Jan 2017 10:33 AM GMTసమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న అస్తవ్యస్థ పరిణామాలు అటు-ఇటు తిరిగి తననే వేలెత్తి చూపేలా ఉండటంపై ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అమర్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూపీ సీఎం అఖిలేష్ అనూహ్య పరిణామాల మధ్య ఎస్పీ సారథిగా ఎన్నికవడం - తనను బహిష్కరించడం - పార్టీలోని కల్లోల పరిణామాలపై లండన్ లో ఉన్నప్పటికీ అమర్ సింగ్ రియాక్టయ్యారు. సమాజ్ వాదీ పార్టీలోని పరిణామాలపై తనను బాధ్యుడిగా చేయడం ఎందుకని వాపోయారు. ఒకవేళ తనే కారణమైతే తనను దూరం పెట్టాలని ఈ సందర్భంగా ఎస్పీ సూపర్ పవర్ అయిన ములాయం సింగ్ ను అమర్ సింగ్ కోరారు.
అంతేకాదు ఈ సందర్భంగా అమర్ సింగ్ తీవ్ర ఆవేదనభరిత వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్తకంగా తనపై విమర్శలు చేసే వారు తన జీవితం - తన కుటుంబం గురించి ఆలోచించాలని అమర్ సింగ్ అభ్యర్థించారు. తను బతికి ఉండాల్సిన అవసరం ఉందని, తన కుటుంబం కోసం అయినా తను జీవించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అనవసర విమర్శలు చేయడం సరికాదని వాపోయారు. ఇక తన సస్పెన్షన్ గురించి మాట్లాడుతూ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/