Begin typing your search above and press return to search.

సీఎం సహాయనిధికే 112కోట్ల కన్నమేయబోయారు!

By:  Tupaki Desk   |   20 Sep 2020 4:15 AM GMT
సీఎం సహాయనిధికే 112కోట్ల కన్నమేయబోయారు!
X
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 112 కోట్లను కొల్లగొట్టబోయారు. అది అలాంటి ఇలాంటి వారి నుంచి కాదు.. అత్యంత భద్రత ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి.. ఈ ఉదంతం ఏపీ సచివాలయ వర్గాల్లో కలకలం రేపింది.

ఏపీలో సీఎం సహాయనిధి నుంచి ఏకంగా 112 కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నాన్ని కొంతమంది చేశారు. అయితే బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో ఈ కుంభకోణం బయటపడింది.

ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా లోని మూడు బ్యాంకుల ద్వారా ఈ నగదును కొల్లగొట్టేందుకు దుండగులు ప్రయత్నం చేశారు. భారీ మొత్తం కావడంతో ఆయా బ్యాంకులు వెలగపూడిలోని ఎస్.బీ.ఐని సంప్రదించాయి. దీంతో మోసం బయటపడింది.

అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్ బద్రి శాఖ నుంచి రూ.52.65 కోట్లు చెక్కు డ్రా.. ఢిల్లీలోని సీసీపీసీఐకి రూ.39.89 కోట్ల చెక్కు డ్రా.. కోల్ కతా సర్కిల్ లోని మోగ్ రాహత్ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కు డ్రా చేసేందుకు యత్నించారు.

మూడు బ్యాంకుల్లో క్లియరెన్స్ కోసం దుండగులు చెక్కులను సమర్పించారు. ఈ మూడు చెక్కులు విజయవాడ ఎంజీ రోడ్ లో ఉన్న బ్రాంచ్ కు చెందినట్లుగా గుర్తించారు. చెక్కులపై సీఎంఆర్ఎఫ్, రెవెన్యూశాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్ అన్న స్టాంప్ పై సంతకం ఉంది.

అయితే ఈ కుంభకోణం బయటపడడానికి ప్రధాన కారణంగా క్లియరెన్స్ కోసం ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా సర్కిళ్లకు చెందిన ఆయా బ్యాంకుల అధికారులు ఇక్కడికి ఫోన్ చేయడంతో కుట్ర బయటపడింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.