Begin typing your search above and press return to search.
బావమరిది పెళ్లికి సెలవు పెట్టాలంటూ భార్య వార్నింగ్ .. వైరల్ అవుతున్న లెటర్ !
By: Tupaki Desk | 12 Dec 2020 5:13 AM GMTభార్య , భర్తల జీవితాల్లో ఎన్నో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్నింటిని చూస్తే అసలు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియదు. బావమరిది పెళ్లికి ఐదు రోజుల సెలవుల కోసం ఓ కానిస్టేబుల్ చేసిన పనేంటో తెలిస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థంకాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ లీవ్ లెటర్ గురించి మీరు కూడా తెలుసుకోండి.అసలు విషయంలోకి వెళ్తే .. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దిలీప్‌కుమార్ అహిర్‌వార్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ అతనికి చిక్కులు తీసుకొచ్చింది. ఈ నెల 7న ఆయన డీఐజీకి ఓ లేఖ రాశాడు.
తన బావమరిది పెళ్లి ఉందని, ఈ నెల 11వ తేదీ నుంచి పెళ్లి పనులు మొదలవుతాయని, పెళ్లికి ఐదు రోజుల పాటు సెలవు మంజూరు చేయాలని కోరాడు. అయితే లీవ్ లెటర్‌లో మరో కామెంట్ కూడా జత కలిపాడు. అదే ఇప్పుడు ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమై , సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నా తమ్ముడి పెళ్లికి రాకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి’ అని తన భార్య వార్నింగ్ ఇచ్చింది అని , కాబట్టి కోరినన్ని రోజులు సెలవులు మంజూరు చేసి భార్య ఆగ్రహం నుంచి కాపాడాలని డీఐజీని కోరాడు. దీంతో సదరు కానిస్టేబుల్‌పై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
కాగా కానిస్టేబుల్ సెలవుల విషయమై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ ....ఇలా ఏదో ఒక ప్రత్యేక కారణాలు చెప్పి అతను కొన్ని నెలలుగా సెలవులు తీసుకుంటూనే ఉన్నాడన్నారు. గత 11 నెలల్లో దాదాపు 55 సెలవులు తీసుకున్నాడని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఏదేమైనా కూడా ఆ కానిస్టేబుల్ రాసిన ఈ లీవ్ లెటర్ మాత్రం వైరల్ అవుతుంది.