Begin typing your search above and press return to search.
ఆ దొంగ, పోలీస్.. మొగుడూపెళ్లాలు
By: Tupaki Desk | 14 Oct 2015 7:45 AM GMTపోలీస్ మొగుడు... దొంగ పెళ్లాం...భలే కాంబినేషన్ కదా.. భర్త దగ్గర బేడీలు ఉంటే.. భార్య దగ్గర బ్లేడు ఉంది.. చివరకు భార్య బండారం బయటపడడంతో పాపం.. ఆ పోలీసు మొగుడి పరువు పోయింది. ముంబైలో ఓ పోలీసు కానిస్టేబుల్ భార్య దొంగతనం కేసులో దొరికిపోయింది. జీఆర్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిసాన్ కట్కర్ భార్య ఉషా కట్కర్(40) బ్యాంగు దొంగతనం చేసిన కేసులో పోలీసులకు దొరికిపోయింది. పది రోజుల కిందట ఆమె ముంబయిలోని సీఎస్టీ రైల్వే స్టేషన్ వద్ద ఈ దొంగతనం చేసినట్లు తేలింది.
అశోక్ రావ్ జీ కాంబ్లి అనే వ్యక్తి కొడుకు పెళ్లి పనుల కోసం బ్యాంకు నుంచి కొంత డబ్బు డ్రా చేసి వస్తుంటే ఉషా దాన్ని కొట్టేసింది. సంచిలో రూ. 16 వేల నగదు - సెల్ ఫోన్ ఉన్నాయి. అశోక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ టీడీ ఫుటేజి చూశారు. దాని ప్రకారం ఉషను గుర్తించి అరెస్టు చేశారు. తీరా చూస్తే ఆమె కూడా ఓ పోలీసు భార్యేనని తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు.
అయితే... ఉష ఎందుకు దొంగగా మారిందనే విషయం తెలుసుకున్న పోలీసులు కంగు తిన్నారు. మిస్ ఫైర్ కేసులో తన భర్త అరెస్టైన నాటి నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, కుటుంబం గడవడం కష్టంగా మారిందని ఉష చెప్పింది. కర్లా జీఆర్పీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఉష భర్త కిసాన్ ను తుపాకీ పొరపాటున పేలిక కేసులో 2011లో అరెస్ట్ చేశారు. లోకల్ ట్రైన్ లో డ్యూటీ చేస్తుండగా అతడి చేతిలో తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటన జరిగినప్పుడు కిసాన్ మద్యం మత్తులో ఉండడంతో అతడిని సస్పెండు చేశారు. ఆ తరువాత ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడింది... దాంతో కుటుంబ పోషణకు తాను దొంగగా మారానని ఉష చెబుతోంది.