Begin typing your search above and press return to search.

పోలీస్‌ స్టేషన్‌ లోనే దుకాణం పెట్టేసిన కానిస్టేబుళ్లు!

By:  Tupaki Desk   |   6 July 2020 3:18 PM IST
పోలీస్‌ స్టేషన్‌ లోనే దుకాణం పెట్టేసిన కానిస్టేబుళ్లు!
X
అనంతపురం జిల్లా హిందూపురంలో పోలీస్ కానిస్టేబుళ్ల నిర్వాకం కాసింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కానిస్టేబుళ్లు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ లోనే మద్యం తాగి అడ్డంగా బుక్కయ్యారు. కానిస్టేబుళ్లు నూర్‌ మహ్మద్, తిరుమలేశ్‌ పోలీస్ స్టేషన్ ‌లో మద్యం తాగి అడ్డంగా దొరికారు. ఎన్ ‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల కర్ణాటక మద్యం బాటిల్స్ ‌ను సీజ్‌ చేసి సదరు పోలీస్‌ స్టేషన్ ‌లో పెట్టగా.. ఆ సీజ్‌ చేసిన లిక్కర్‌ ను ఇద్దరు కానిస్టేబుళ్లు తాగారు. దీనికి సంబంధించి స్టేషన్ లో పోలీసులు మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.

ఈ ఘటనను సీరియస్ ‌గా తీసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు విచారణకు ఆదేశించారు. ఇద్దర్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే కానిస్టేబుళ్ల వాదన మరోలా ఉంది. గత రెండు, మూడు నెలలుగా పోలీసులు లాక్‌డౌన్ విధుల్లో ఉంటున్నామని.. తమకు పోలీస్ స్టేషన్‌లో ఓ గదిని కేటాయించారని చెబుతున్నారు. అలాగే తాము తాగిన లిక్కర్ సీజ్ చేసింది కాదని చెబుతున్నారు. చూడాలి మరి వీరిపై ఉన్నత అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ..