Begin typing your search above and press return to search.

ఇదేమి విచిత్రమో ..కొట్టకుండానే గుడిలో గంట మోగుతుంది !

By:  Tupaki Desk   |   16 Jun 2020 1:30 AM GMT
ఇదేమి విచిత్రమో ..కొట్టకుండానే గుడిలో గంట మోగుతుంది !
X
ఒకే ఒక వైరస్ ..మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల జీవితాల్లో ఎన్నో ఊహించని మార్పులని తీసుకువచ్చింది. ప్రతి మనిషికి శుచి, శుభ్రత విలువను తెలియజేసింది. కరోనా ప్రభావంతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడమే కాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. ఈ వైరస్ ను అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ ను విధించడంతో ఆలయాలన్నీ మూసేసారు. మళ్లీ లాక్ డౌన్ సడలింపులతో ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. అయితే , ఆలయాల్లో కూడా వైరస్ నియమాలని పాటించాల్సిందే.

ఇక , ఈ వైరస్ విలయతాండవం చేస్తున్న నేప‌థ్యంలో ఆల‌యాల్లో తీర్థ‌ప్ర‌సాదాలు, శ‌ఠ‌గోపం ర‌ద్దు చేశారు. అయితే, గుడికి వెళ్ల‌గానే భ‌క్తులు త‌ప్ప‌క చేసే ప‌ని, గుళ్లో గంట మోగించ‌టం. మ‌రీ వైర‌స్ వ్యాప్తితో గుడి గంట కొట్టాల‌న్న భ‌క్తులు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఒకవేల ఎవరైనా కొట్టాలని ప్రయత్నిస్తే ..గంట కొట్టిన ప్రతిసారి ఆ గంటను శానిటైజ్ చేయడం సాధ్యమయ్యే పనికాదు.

ఇటువంటి త‌రుణంలో మధ్యప్రదేశ్లో ఓ గుడిలో ఈ సమస్యకు పరిష్కారంగా కొట్టకుండానే మోగే గంటను అందుబాటులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్ లోని మందాసుల్ ప్రాంతంలో ఉన్న పశుపతినాథ్ దేవాలయంలో ఎవరూ తాకకుండానే గంట కొట్టుకునే ఏర్పాటు చేశారు. సెన్సార్ సాయంతో పనిచేసే ఈ గంట కింద నిలబడి చెయ్యి చాస్తే అది మోగుతుంది. దీంతో అక్క‌డికి వ‌స్తున్న భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని దేవాలయాల్లోనూ ఇటువంటి గంటలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మరో విశేషం ఏమిటంటే ఈ కాంటాక్ట్ లెస్ గంటను 62 సంవత్సరాల నారూ ఖాన్ మేవ్ అనే ముస్లిం వయోవృద్ధుడు తయారు చేయడం. రూ.6 వేలు ఖర్చు పెట్టి ఓ సెన్సార్ ను ఇండోర్ నుంచి తెచ్చి గుడికి బహుమతిగా ఇచ్చారు. కాగా, ఇక్క‌డికి వ‌చ్చిన కొంద‌రు భ‌క్తులు దానిని త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌టంతో కాంటాక్ట్ లెస్ గంట వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.