Begin typing your search above and press return to search.
రాజంపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేది ఈయనే!
By: Tupaki Desk | 8 July 2022 4:29 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముందుకు కదులుతున్నారు. మే 28, 29 తేదీల్లో నిర్వహించిన మినీ మహానాడు సక్సెస్ కావడంతో మంచి జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం ఓవైపు ప్రభుత్వం వివిధ చార్జీలను పెంచడంపై బాదుడే బాదుడు కార్యక్రమంతోపాటు అన్ని జిల్లాల్లోనూ మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంతా చురుగ్గా చంద్రబాబు పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇదే కోవలో రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించేశారు.
రాజంపేట లోక్ సభ స్థానం నుంచి గంట నరహరి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం తన సొంత జిల్లా చిత్తూరులో పర్యటిస్తున్న చంద్రబాబు మినీ మహానాడులు నిర్వహించడంతోపాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ప్రముఖ పారిశ్రామివేత్త గంటా నరహరి పోటీ చేస్తారని వెల్లడించారు. కాగా నరహరి ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ తరఫున దివంగత ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు సతీమణి డీకే సత్యప్రభ పోటీ చేశారు. డీకే సత్యప్రభ, గంటా నరహరి ఇద్దరూ బలిజ (కాపు) సామాజికవర్గానికే చెందినవారే కావడం గమనార్హం.
రాజంపేటకు చెందిన గంటా నరహరి బెంగళూరు కేంద్రంగా తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ యువ పారిశ్రామికవేత్త అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు. కాగా నరహరి.. డీకే ఆదికేశవుల నాయుడికి సన్నిహిత బంధువు. డీకే సత్యప్రభ మేనకోడలినే నరహరి పెళ్లి చేసుకున్నారు.