Begin typing your search above and press return to search.
గోవాలో పర్యాటకులమీద నిరంతర నిఘా.! మాస్క్ లేదంటే వాయింపే..!
By: Tupaki Desk | 2 Dec 2020 2:00 PM GMTప్రజల్లో కరోనా భయం తగ్గిపోయింది. కేసుల సంఖ్యను ప్రజలు పట్టించుకోవడం లేదు. ఖాళీ దొరికితే చాలు ఎప్పటిలాగే టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. గోవాకు కూడా టూరిస్టులు పోటెత్తుతున్నారు. మాస్కులు సంగతి మరిచిపోయి.. భౌతికదూరం అనే విషయం లెక్కచేయకుండానే తిరుగుతున్నారు. దీంతో గోవా ప్రభుత్వం కఠిననిబంధనలు అమలుచేస్తున్నది. మాస్కు లేకుండా కనిపించే టూరిస్టులకు రూ. 200 జరిమానా విధిస్తోంది.
ఇందుకోసం అధికారులు అన్ని బీచ్‌లు, పర్యాటకప్రదేశాలలు, జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాటు వేశారు. మాస్కులు లేకుండా కనిపించినవారికి అక్కడికక్కడే జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మాస్క్, శానిటైజర్ బాటిల్ నిత్యావసరంగా మారిపోయాయి. కొంతమంది విధిగా మాస్కులు ధరిస్తున్నారు. కానీ చాలామంది కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారు. కేసులు తగ్గుతుండటం, మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉండటంతో ప్రజల్లో కరోనా భయం పోయింది. తమకేమీ కాదులే అనుకునేవారు ఎక్కువయ్యారు. దీంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
లాక్ డౌన్ లో చాలా రోజులుగా ఇళ్లకే పరిమితం అయిన జనం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో గోవాకు టూరిస్టులు పోటెత్తుతున్నారు. కాగా అక్కడికి విదేశీపర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా తిరగదోడే అవకాశం ఉన్నది. అందుకే గోవా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. గోవాలో స్థానికులు విధిగా మాస్కులు ధరిస్తున్నారు. కానీ దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు మాత్రం మాస్కులు పెట్టుకోవడం లేదు. మాస్కులు పెట్టుకోవాలని సూచించిన అధికారులతో వాదనకు దిగుతున్నారు. దీంతో ప్రభుత్వం జరిమానా కఠినంగా అమలుచేస్తున్నది.