Begin typing your search above and press return to search.
వైసీపీ పాలనలో టీడీపీ నేతకు 10 కోట్ల కాంట్రాక్టు!
By: Tupaki Desk | 9 Sep 2020 2:00 PM GMTఇది వైసీపీ పాలన.. టీడీపీని బాగా వ్యతిరేకించే సీఎం వైఎస్ జగన్ పాలిస్తున్నారు. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అంటే ఉప్పు నిప్పులా ఉంటాయి. అయితే గత చంద్రబాబు పాలనలో ఎలాగూ కాంట్రాక్టులన్నీ టీడీపీ నేతలకే పోయాయన్న ప్రచారం ఉంది. మరి వైసీపీ పాలన వచ్చాకన్నా పరిస్థితి మారిందా అంటే అదేం లేదు అంటున్నారు వైసీపీ శ్రేణులు. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి అవాక్కవుతున్నారు.
ఏపీలోని కొండపీ నియోజకవర్గంలో సుమారు 10 కోట్ల విలువైన పనులను టంగుటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరులైన వలస నాయకులకు అప్పగించారు. ఇది చూసి వైసీపీ నాయకులు మొత్తుకుంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కాంట్రాక్టులో అంతులేని అవినీతి చోటుచేసుకుందని నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
ఇక ఇదే కాదు.. నాడు-నేడు పనుల కింద ప్రభుత్వ పాఠశాలకు రూ.30లక్షల విలువైన సిమెంట్ ఇటుక సరఫరా కాంట్రాక్ట్ పనిని బింగినపల్లికి చెందిన టీడీపీ నాయకుడికి అప్పగించారు. ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చినందుకు రూ.3 లక్షల కమీషన్ కూడా ఇచ్చానని సదురు టీడీపీ నాయకుడే బహిరంగంగా చెబుతుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ఇలా కమీషన్లు తీసుకొని టీడీపీ వారికి.. అధికారం కోసం టీడీపీ నుంచి వలసవచ్చిన నాయకులకు పనులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన కార్యకర్తలు కొండపి నియోజకవర్గ ఇన్ చార్జి వ్యవహారశైలిపై పలు విమర్శలు చేస్తున్నారు.