Begin typing your search above and press return to search.
బిల్లులు రాక బెజవాడ ధర్నా చౌక్ లో భిక్షాటన చేసిన ఏపీ కాంట్రాక్టర్లు
By: Tupaki Desk | 8 Oct 2021 12:20 PM GMTఒకప్పుడు ఒకింత దర్జాగా.. మరింత ధీమాగా కనిపించిన వారంతా ఇప్పుడు అయ్యో అనుకునే పరిస్థితుల్లోకి వచ్చేశారు. ఒకప్పుడు కోట్లాది రూపాయిల్ని తమ చేతుల మీదుగా తిప్పిన వారంతా.. ఇప్పుడు తాము చెల్లించాల్సిన అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెండింగ్ బిల్లుల సమస్యతో ఏపీ కాంట్రాక్టర్లు తీవ్రంగా తల్లడిల్లుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ప్రభుత్వంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు షాకింగ్ గా మారిందంటున్నారు.
పనులు పూర్తి చేసి ఏళ్లు అవుతున్నా.. క్లియర్ కావాల్సిన బిల్లులు క్లియర్ కాకపోవటంతో వారంతా కిందామీదా పడుతున్నారు. తమ విషయంలో ఏపీలోని ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వారు వాపోతున్నారు. ఆ మధ్యన తమకు బిల్లులు చెల్లించకపోవటాన్ని తప్పు పట్టిన కాంట్రాక్టర్లు.. హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పందించి.. బిల్లులు క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ.. సాంకేతిక అంశాల్లో కొర్రీలు చూపిస్తున్న ప్రభుత్వ అధికారులు.. బిల్లులు పాస్ చేయటానికి మోకాలు అడ్డుతున్నారు. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న పనేనని వాపోతున్నారు.
తాజాగా తమ పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాలని కోరుతూ.. బెజవాడ ధర్నా చౌక్ లో భిక్షాటన చేస్తూ నిరసన చేశారు కాంట్రాక్టర్లు. అప్పట్లో తాము చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లుల్ని చెల్లించకుండా ఉంటున్న ఏపీ ప్రభుత్వ తీరు.. తమ ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి టీడీపీ హయాంలో చేపట్టిన బిల్లుల్ని చెల్లించకుండా పెండింగ్ లో ఉంచేస్తున్నారు. బాబు ప్రభుత్వంలో పనులు చేయటమే పాపం అన్నట్లుగా ప్రభుత్వ విధానం ఉందన్న మాట వినిపిస్తోంది. విజిలెన్సు విచారణలు.. కేంద్రం నిధులు ఆలస్యం లాంటి కారణాలు చూపిస్తూ బిల్లుల చెల్లింపుల్ని ఆలస్యం చేస్తున్నారంటున్నారు. తాజాగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు.. అర్థనగ్నంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
బెజవాడ ధర్నా చౌక్ లో భిక్షాటన చేసిన వైనం షాకింగ్ గా మారింది. నాడు పోషకులం.. నేడు యాచకులం అంటూ బ్యానర్లు పట్టుకొని మరీ ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. ''మేము ఉంటాము మీ వెంటే.. మేము మిగిలి ఉంటే'' అంటూ వారు వేడుకుంటున్న వైనం చూపురులను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో కాంట్రాక్టర్లమని గొప్పగా చెప్పుకునే వారమని.. ఇప్పుడు అలా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించి తమ ప్రాణాల్ని కాపాడాలని వేడుకుంటున్న వారు.. పనుల తాలూకు పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. నవరత్నాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులోనే బాబు ప్రభుత్వంలో పనులు చేసిన వారికి చెల్లించాల్సిన బిల్లుల విషయంలోనూ అనుసరించాలని కోరుతున్నారు. కాంట్రాక్టర్ల వేదన వినేందుకుజగన్ కాసింత సమయం ఇవ్వాలని కోరుతున్న వైనం చూస్తే.. ఏపీ కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.