Begin typing your search above and press return to search.

ఉల్లి ఘాటు ఎఫెక్ట్‌ ను మ‌రిచారా మంత్రిగారు?

By:  Tupaki Desk   |   30 Nov 2017 5:10 AM GMT
ఉల్లి ఘాటు ఎఫెక్ట్‌ ను మ‌రిచారా మంత్రిగారు?
X
గ‌తాన్ని ఎప్పుడూ మ‌ర‌చిపోకూడ‌దు. గ‌తాన్ని పాఠంగా తీసుకుంటే త‌ప్పులు చోటు చేసుకోవు. చ‌రిత్ర‌ను చిన్న‌చూపు చూసినోళ్లు.. చ‌రిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని వారు బాగుప‌డిన దాఖ‌లాలు చ‌రిత్ర‌లో క‌నిపించ‌దు. ఈ చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోయిన‌ట్లున్నారు కేంద్ర‌మంత్రివ‌ర్యులు రాంవిలాస్ పాశ్వాన్‌. సీనియ‌ర్ మంత్రి అయిన ఆయ‌న‌కు రాజ‌కీయం గురించి ప్ర‌త్యేకంగా పాఠాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. తాజాగా ఉల్లి రేటు విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర‌మంత్రి. క‌దిలించి పెట్టించుకునేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి.

వాజ్ పేయ్ స‌ర్కారు ఉన్న‌ప్పుడు భార‌త్ వెలిగిపోతుందంటూ భారీ ప్ర‌చార‌మే చేశారు. అయితే.. ఈ ప్ర‌చారాన్ని తుస్ మ‌నేలా చేసింది అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఒక‌టి ఆలూ.. రెండోది ఉల్లిపాయ . సామాన్యులు మొద‌లుకొని అస‌మాన్యుల ఇళ్ల‌ల్లోనూ త‌ప్ప‌నిస‌రిగా ఉండే వంట సామాను. అప్ప‌ట్లో ఉల్లి కేజీ వంద‌కు దాట‌టం.. దీని ప్ర‌భావంతో నాటి వాజ్ పేయ్ ప్ర‌భుత్వానికి ఎంత దెబ్బ త‌గ‌లాలో అంత దెబ్బ రాజ‌కీయంగా త‌గిలింది.

క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ ప‌దేళ్ల వ‌ర‌కూ బీజేపీ నేత‌ల‌కు అధికారం చేతికి చిక్క‌లేదు. మోడీ పుణ్య‌మా అని 2014లో ఆయ‌న ప్ర‌ధానిగా ఎన్నిక కావ‌ట‌మే కాదు.. దేశ వ్యాప్తంగా బీజేపీ వెలుగులు ప‌రుచుకుంటున్నాయి.అవినీతి అన్న‌ది లేద‌ని.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏదో ఒక కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చేద‌ని.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌టం లేదు.

ఇదిలా ఉంటే.. ఈమ‌ధ్య‌న ఉల్లి ధ‌ర భారీగా పెరిగింది. దీనికి కార‌ణం దిగుబ‌డి త‌గ్గ‌టంతో పాటు.. డిమాండ్ కంటే దాదాపు 30 శాతం త‌క్కువ‌గా పంట వేయ‌టం కూడా కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం బ‌య‌ట చిల్ల‌ర అంగ‌డిలో కిలో ఉల్లి దాదాపురూ60 వ‌ర‌కూ వెళ్లింది. రానున్న రోజుల్లో ఈ ధ‌రాఘాతం మ‌రింత పెర‌గ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ పెరిగిన ధ‌ర‌ను త‌గ్గించేందుకు వీలుగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అలాంటిదేమీ జ‌ర‌గ‌క‌పోగా.. రేట్లు పెర‌గ‌టానికి కార‌ణం త‌గ్గిన విస్తీర్ణంలో పంట‌ను సాగు చేయ‌లేద‌న్న విష‌యాన్ని చెబుతున్నారు కేంద్ర‌మంత్రివ‌ర్యులు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్యంతా.

ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయ‌న్న దాని కంటే.. ధ‌ర‌ల్ని త‌గ్గించే చ‌ర్య‌ల్ని ప్ర‌క‌టిస్తే ప్ర‌జ‌లు సంతోషిస్తారు. అందుకు భిన్నంగా వ్యాఖ్య‌లు చేస్తే ఇబ్బందే. ఉల్లిధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వ్య‌వ‌సాయ విస్తీర్ణంలో పంట వేయ‌టం త‌క్కువ‌గా ఉంద‌ని చెప్పే బ‌దులు విదేశాల నుంచి భారీగా స‌రుకు తెప్పించి ఇక్క‌డ పెరిగిన ధ‌ర‌లకు బ్రేకులు వేయాల్సి ఉంది. కానీ.. అలాంటిది జ‌గ‌ర‌క పోగా.. పెరిగిన ఉల్లిధ‌ర‌ల్ని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం చూస్తే.. పాశ్వాన్ మాష్టారు గ‌తాన్ని..అప్ప‌ట్లో ఉల్లి వేసిన దెబ్బ‌ల్ని మ‌ర్చిపోయిన భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ప‌వ‌ర్ లో ప్ర‌జ‌ల క‌ష్టాలకు స్పందించాల్సిన రీతిలో స్పందించ‌కుంటే న‌ష్టం ఎంత‌న్న‌ది పాశ్వాన్‌కు అర్థ‌మ‌య్యేలా ప్ర‌జ‌లు చెప్ప‌టం ప‌క్కా.