Begin typing your search above and press return to search.
క్రికెటర్లు VS తస్లీమా!
By: Tupaki Desk | 7 April 2021 10:33 AM GMTవివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇటీవల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీపై ఆమె సంచలన కామెంట్లు చేశారు. మెయిన్ ఒకవేళ క్రికెటర్ కాకపోయి ఉంటే టెర్రరిస్ట్ అయ్యి ఉండేవాడని.. ఏదో ఓ ఉగ్రవాద సంస్థలో చేరిపోయేవాడని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తస్లీమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఈ అంశం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యింది.
కొందరు క్రికెటర్ల తస్లీమా అలా అనడం సరికాదని.. ఆమె వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కామెంట్లు చేశారు. మరోవైపు మొయిన్ అలీకి కూడా నెటిజన్ల మద్దతు దక్కింది. తస్లీమా వ్యాఖ్యలపై మెయిన్ అలీ తీవ్రంగా నొచ్చుకున్నారట. ఆమెపై అతడు కోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నలిచారు.
తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలు .. మొయిన్ అలీ సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. అమెపై న్యాయపరమైన చర్యలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు టాక్. ఈ మేరకు అలీ మేనేజ్మెంట్ కంపెనీ ఎసెస్ మిడిల్ ఈస్ట్ ఓ ట్వీట్ చేసింది.‘తస్లీమా వ్యాఖ్యలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. ఓ వ్యక్తిని టార్గెట్ చేసి.. నిరాధారంగా మాట్లాడటం చట్ట విరుద్ధం. ఈ విషయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఐపీఎల్ 14వ సీజన్ లో మెయిన్ అలీ సీఎస్‌కేకు తరఫున ఆడబోతున్నాడు. సీఎస్‌కే అలీని రూ.7 కోట్లకు దక్కించుకున్నది.