Begin typing your search above and press return to search.

శ్రీరాముడు మద్యం తీసుకునేవాడు.. ప్రముఖ రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   21 Jan 2023 7:59 AM GMT
శ్రీరాముడు మద్యం తీసుకునేవాడు.. ప్రముఖ రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు
X
రాముడు ప్రతిరోజు మధ్యాహ్నం తన భార్య సీతతో కలిసి కూర్చుని మద్యం తాగేవాడని 'వాల్మీకి రామాయణం' చెబుతోందని ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్ భగవాన్ సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెర లేపారు. మధ్యాహ్నం సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్రధాన కార్యకలాపం అని నోరుపారేసుకున్నారు.. ఇది నేను చెప్పడం లేదు. అని పత్రాలు చెబుతున్నాయని, ఈ రచయిత చెప్పడం దుమారం రేపింది.

జనవరి 20, 2023న కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భగవాన్ శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2019 లో రచయిత వాల్మీకి రామాయణం ప్రకారం, రాముడు 'మత్తు' తాగేవాడని , సీతను కూడా తీసుకునేలా చేసాడు అని పెద్ద వివాదానికి దారితీసింది. 'రామ మందిర యాకే బేడ' అనే పుస్తకంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేఎస్ భగవాన్ వ్యాఖ్యలపై కొన్ని హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రచయిత నివాసం వెలుపల పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో కేఎస్‌ భగవాన్‌ నివాసం వెలుపల ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అప్పట్లో కువెంపునగర్‌లోని భగవాన్ నివాసం వెలుపల కేఎం నిశాంత్ నేతృత్వంలోని హిందూ సంస్థ ఇదే విధంగా ఆందోళన చేసేందుకు ప్రయత్నించింది.

హిందూ దేవుళ్లపై రచయిత చేసిన ప్రకటనలు "సమాజం శాంతికి భంగం కలిగించాయి" అని బీజేపీ నేత నిశాంత్ పేర్కొన్నారు. "వాల్మీకి రామాయణంలోని చివరి అధ్యాయమైన ఉత్తర కాండలోని శ్లోకాలను భగవాన్ తన 'రామ మందిర యాకే బేడ' పుస్తకంలో పేర్కొన్నప్పటికీ, వాల్మీకి ఈ అధ్యాయాన్ని రాయలేదని..హిందువులు ఉత్తర కాండతో ఏకీభవించరని ఆయన తెలుసుకోవాలని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు.. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు, ఉత్తర కాండ ప్రస్తావన లేదు" అని నిశాంత్ ఉటంకించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.