Begin typing your search above and press return to search.
వివాదాస్పద శివలింగం.. హిందువుల పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు!
By: Tupaki Desk | 14 Oct 2022 1:27 PM GMTజ్ఞాన్‌వాపీ కేసులో హిందువుల పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగం ఎప్పుడో తెలుసుకోవడానికి దానికి కార్బన్ డేటింగ్ పరీక్షతోపాటు శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని హిందువులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌కు వారణాసి జిల్లా కోర్టు అనుమతి నిరాకరించింది. కార్బన్ డేటింగ్ పరీక్ష చేస్తే శివలింగం దెబ్బతింటుందని తాజాగా తీర్పు వెలువరించింది.
ఓ వైపు శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించి.. అది ఏ కాలం నాటిదో తేల్చాలని హిందువులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ముస్లింలు.. హిందువుల పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది.
కార్బన్ డేటింగ్ లేదా ఏదైనా శాస్త్రీయ అధ్యయనం నిర్వహించడం వల్ల శివలింగానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని వారణాసి జిల్లా కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఆ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి అజయ్ కృష్ణ విశ్వేశ వెల్లడించారు. కాగా ఈ అంశంపై అక్టోబరు 11నే విచారణలు ముగియగా.. తీర్పును రిజర్వులో ఉంచి తాజాగా వెలువరించారు.
కాగా జ్ఞాన్‌వాపీ మసీదు ఆవరణలో ఉన్న గౌరి మాతను పూజించేందుకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు 2021 ఆగస్టులో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణలో భాగంగా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించారు. అప్పుడు అక్కడ గౌరీ మాత మాత్రమే కాకుండా శివలింగం కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అది ఏ కాలం నాటిదో తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించాలని హిందువులు పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని తాజాగా కోర్టు తిరస్కరించింది.
వీడియో సర్వే సందర్భంగా మసీదు కొలనులో గుర్తించింది అసలు శివలింగం కాదని, దీనికి శాస్త్రీయ అధ్యయనం అవసరం లేదనేది ముస్లిం సంఘాల వాదనగా ఉంది. శివలింగం ఆకారంలో ఉన్నది అసలు శివలింగమే కాదని.. అది ఒక ఫౌంటెయిన్ అని అంటున్నాయి. ఈ సందర్భంగా మే 17న సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులను ప్రస్తావించాయి. కొలనులో లభ్యమైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని సుప్రీంకోర్టు చెప్పిందని ముస్లిం సంఘాలు గుర్తు చేశాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.