Begin typing your search above and press return to search.
మునుగోడులో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వివాదాస్పద పోస్టర్లు!
By: Tupaki Desk | 11 Oct 2022 10:41 AM GMTతెలంగాణలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఓవైపు అధికార టీఆర్ఎస్, తమ సిట్టింగ్ సీటును దక్కించుకోవడానికి కాంగ్రెస్, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని పెద్ద ఆశలే పెట్టుకున్న బీజేపీ ఈ స్థానంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇంకా చిన్నచితకా పార్టీల తరఫున కూడా బరిలో ఉన్నారు.
ఇప్పటికే అయారాంగయారాంలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇవ్వాళ ఒక పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ భారీ ఎత్తున వందల కోట్ల రూపాయలు డబ్బులు మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది. తమ సిట్టింగ్ సీటు కావడం, మిగతా పార్టీలకు భిన్నంగా మహిళకు సీటు ఇవ్వడంతో కాంగ్రెస్ విజయంపై ధీమాగా ఉంది. స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఒక మండలానికి బాధ్యతలు తీసుకోవడంతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలోకి దూకుతోంది.
కాగా నవంబరు 3న మునుగోడుకు ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 6న ఫలితం వెల్లడవుతుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
ఈ నేపథ్యంలో మునుగోడులో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో కీలకమైన చండూరు మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. రూ.18 వేల విలువైన కాంట్రాక్టులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని ఇప్పటికే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆ పోస్టర్లు అతికించారు. ఫోన్ పే సింబల్ తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ వేసి సర్కిల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఫొటో వేశారు. దానికింద రూ.18,000 కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేటాయించడం జరిగింది అని పోస్టర్‌లో రాసి ఉంది. ఇది ప్రత్యర్థి పార్టీల పనేనని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
రాజగోపాలరెడ్డి ప్రతి ఓటుకు వేలాది రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని, కావాల్సిన వారు ఫలానా నెంబర్ కు ఫోన్ చేయండంటు ఫేన్ పే మొబైల్ నెంబర్ ఇవ్వడం కలకలం రేపుతోంది. రూ.18 వేల కాంట్రాక్టులు పొందారు కాబట్టి మునుగోడులో ఎంత పెట్టి అయినా ఆయన ఓట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడమే ప్రత్యర్థి పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ఆరోపించడం గమనార్హం.
మరోవైపు ఇటీవల మీడియా చానెళ్లతో మాట్లాడుతూ స్వయంగా రాజగోపాలరెడ్డే స్వయంగా ఈ విషయం చెప్పారు. తనకు ఆరు నెలల ముందే కాంట్రాక్టులు వచ్చాయని.. వాటి విలువ రూ.18 వేల కోట్లని ఆయన చెప్పుకున్నారు. దీంతో నియోజకవర్గం ప్రజల్లోనూ ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజగోపాల్‌రెడ్డి ఇరకాటంలో పడ్డారు. ఈ వ్యవహారం ఆయనకు ఎన్నికలో ఇబ్బంది సృష్టించే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.