Begin typing your search above and press return to search.

బదాయా ఘటన: నోరుజారిన మహిళా కమిషన్ సభ్యురాలు

By:  Tupaki Desk   |   8 Jan 2021 12:30 AM GMT
బదాయా ఘటన: నోరుజారిన మహిళా కమిషన్ సభ్యురాలు
X
ఉత్తరప్రదేశ్ లోని బదాయాలో మహిళపై జరిగిన ఆకృత్యం దేశమంతా దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమెను ఎముకలు విరిచి మరీ అత్యాచారం చేసిన వైనం మరో నిర్భయ ఘటనను గుర్తు చేసింది.ఈ ఆకృత్యంపై తాజాగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది.

తాజాగా బదాయూ బాధిత కుటుంబాన్ని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి బుధవారం వెళ్లి కలిశారు. కుటుంబ సభ్యుల్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘బయట తిరిగే సమయాన్ని సరిగ్గా గుర్తు పెట్టుకోవాలి. ఆలస్యంగా బయటికి వెళ్లకుండా జగ్రత్త పడాలి. బాధితురాలు సాయంత్రం ఆలస్యంగా బయటికి వెళ్లకపోయినా, లేదంటే ఎవరైనా కుటుంబ సభ్యుల్ని వెంట తీసుకు వెళ్లినా ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేది. ఈ దారుణం జరిగి ఉండేది కాదు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండి చంద్రముఖి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఆమెపై అందరూ మండిపడ్డారు. ఒక మహిళ అయ్యి ఉండి.. మహిళా రక్షణ సంస్థలో ఉంటూ ఇలా మాట్లాడుతారా? అని మండిపడ్డారు. ఈ విషయం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ వరకు వెళ్లడంతో చంద్రముఖిని పిలిపించి మాట్లాడుతానని అమె అన్నారు. మహిళలకు సర్వాధికారాలు ఉన్నాయని.. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సమాజంతోపాటు మనకు ఉందని రేఖా శర్మ తెలిపారు. చంద్రముఖి వ్యాఖ్యలపై వివరణ కోరుతానని తెలిపారు.