Begin typing your search above and press return to search.
తక్కువగా తినండి అంటూ పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 12 Oct 2021 9:45 AM GMTపాకిస్థాన్ దేశ మంత్రి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై తాజా షాకింగ్ కామెంట్ చేశారు. ధరల పెరుగుల నేపథ్యంలో ప్రజలు తక్కువ తినాలని కోరిన పాక్ మంత్రి వివాదానికి తెర లేపారు. చక్కెర, పిండి పదార్థాల ధరలు పెరుగుతున్నందు వల్ల ప్రజలు వీటిని తక్కువ తినాలని పాక్ దేశంలోని గిల్గిత్ బాల్టిస్తాన్ మంత్రి అలీ అమిన్ గందపూర్ కోరారు. ద్రవ్యోల్బణం గురించి బహిరంగ సభలో ప్రసంగించిన పాక్ మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ద్రవ్యోల్బణం గురించి చెబుతూ ప్రజలు పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి త్యాగాలు చేయాలని మంత్రి కోరారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరల రెట్టింపు పెరిగాయని ఫఖ్తున్ జాతీయవాద పార్టీ సీనియర్ నాయకుడు గులాం అహ్మద్ బిలోర్ ఆరోపించారు. సాధారణ ఎన్నికల సమయంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ పాకిస్థాన్ అవామీ నేషనల్ పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు.
కరోనా తరువాత వివిధ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్ లో కూడా ఈ సంక్షోభం మొదలైంది. దేశంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని ప్రజలు ఆందోళనల చేస్తున్నారు. కాగా, పెరిగిన ఈ ధరలపై పాక్ మంత్రి అలీ అమిన్ గందపూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిత్యవసర ధరలు పెరిగాయి కాబట్టి ప్రజలు తక్కువ తినాలని అన్నారు. ద్రవ్యోల్భణం గురించి బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి ప్రజలు త్యాగాలు చేయాలని కోరారు. ఇక దేశంలో నిత్యవసర ధరలు పెరుగుతుండటంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని ఆరోపణలు చేస్తున్నాయి.