Begin typing your search above and press return to search.

కాళేశ్వరంపై కేసీఆర్ కు ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   10 Jan 2023 10:09 AM GMT
కాళేశ్వరంపై కేసీఆర్ కు ఎదురుదెబ్బ
X
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవరించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో సవరించాలని తెలిపింది. మూడో టీఎంసీ కోసం అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన వినతులను పరిశీలించాలని తెలిపింది.

అయితే భూసేకరణ విషయంలో రైతులకు సరైన పరిహారం అందించాలని పేర్కొంది. పరిహారం తీసుకొని భూములు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కాళేశ్వరం మూడో టీఎంసీ ప్రాజెక్టు ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గతంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం తరుపున న్యాయవాది వైద్యనాదన్ వాదనలు వినిపించారు.

తుది తీర్పు వచ్చే లోగా అనుమతులపై గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఉత్తర్వులను సవరణ చేయాలని కోరారు. తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

దీంతో వాదనలు విన్న సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వినతులను పరిశీలించాలని పేర్కొంది. అయితే భూసేకరణ విషయంలో రైతులు వ్యతిరేకత ఉండడంతో వారి తరుపున చెరుకు శ్రీనివాసరెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. పరిహారం తీసుకొని భూములు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కానీ రైతులకు పరిహారం విషయంలో ఎలాటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తమకు పరిహారం అందడం లేదని రైతులు కోర్టును ఆశ్రయించారు. మరోసారి రైతులను పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల రైతుల ఆందోళన ఉధృతం కాకముందే కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లోగా మూడో టీఎంసీపై తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఒకే.. గానీ కాస్త అటూ ఇటూ అయితే దెబ్బ పడే అవకాశం ఉంది. అందువల్ల ముందుగా రైతులకు అవసరమైన పరిహారం అందించి వారిని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. కాళేశ్వర ప్రాజెక్టు మూడో టీఎంసీపై ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. మరోవైపు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వానికి మరెన్ని చిక్కులు ఎదురవుతాయో చూడాలి.