Begin typing your search above and press return to search.

విభ‌జ‌న వివాదం : అటు గోదావ‌రి ఇటు కృష్ణ ? ఇరు తీరాల చెంత !

By:  Tupaki Desk   |   5 April 2022 7:30 AM GMT
విభ‌జ‌న వివాదం : అటు గోదావ‌రి ఇటు కృష్ణ ? ఇరు తీరాల చెంత !
X
కొంద‌రికే మోదం కొంద‌రికి భేదం అన్న విధంగా జిల్లాల విభ‌జ‌న ఉంది వీటిపై కోర్టులలోకేసులు న‌మోదు కానున్నాయి కొన్ని జిల్లాల విభ‌జ‌న ప్ర‌క్రియ ఆగిపోయి య‌థాత‌థ స్థితిలో కొన‌సాగించాల్సి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు.

అటు గోదావ‌రి చెంత ఇటు కృష్ణ‌మ్మ చెంత వివాదాలు రేగుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన విభ‌జ‌న అంటూ కొత్త ఎత్తుగ‌డ వేశారో కానీ అక్క‌డి నుంచి చాలా విష‌యాలు కాలగ‌ర్భంలో క‌లిసిపోయాయి. గోదావ‌రి జిల్లాలే తీసుకుంటే త‌మ‌ను కోన‌సీమ జిల్లాలో క‌ల‌ప‌వ‌ద్ద‌ని కోరుతూ మండ‌పేట వాస్త‌వ్యులు (ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రికి చెందిన ప్రాంతం అని రాయాలి) రోడ్డెక్కారు.

త‌మ మండ‌లాన్ని తూర్పుగోదావ‌రి జిల్లా(జిల్లా కేంద్రం : రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) లోనే ఉంచాల‌ని కోరుతూ మొన్న‌టి వేళ సంబంధిత ఐక్య కార్యాచ‌ర‌ణ స‌భ్యులంతా రోడ్డెక్కి ప్ర‌భుత్వంపై త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. సంబంధిత జీఓ కాపీల‌ను త‌గుల‌బెట్టారు. అదేవిధంగా జిల్లాలు ఏర్పాట‌యిన రోజు (సోమ‌వారం) నియోజ‌క‌వ‌ర్గ బంద్ కు కూడా పిలుపునిచ్చారు.

ఈ విమ‌ర్శ‌ల‌ను వైసీపీ ప‌ట్టించుకోలేదు. అదేవిధంగా స్థానిక నాయ‌కులు కూడా అధినాయ‌క‌త్వం ఆదేశాల‌కు అనుగుణంగా న‌డుచుకుంటూ ఎక్క‌డా ఏ నిర‌స‌న‌లోనూ పాల్గొన లేదు. ఇక్క‌డున్న టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ జిల్లా విభ‌జ‌న అశాస్త్రీయంగా ఉంద‌ని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామ‌ని అంటున్నారు. మ‌రో వైపు విజ‌య‌వాడ కూడా విభ‌జ‌న కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయింది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ తో స‌హా ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ మొత్తం కృష్ణా జిల్లాలో ఉండిపోయింది. కేవ‌లం ఎన్టీఆర్ పేరు త‌ప్ప త‌మ జిల్లాకు ద‌క్కిందేమీ లేద‌ని వీరంతా వాపోతున్నారు.

మ‌ల్ల‌వ‌ల్లి ఫుడ్ పార్క్ ను కూడా తాము కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని విజ‌య‌వాడ వాసుల ఆవేద‌న‌ను ప్ర‌ధాన మీడియా వెలుగులోకి తెచ్చింది. విజ‌య‌వాడ గ్రేట‌ర్ న‌గ‌రంలో క‌ల‌వాల్సిన గ్రామాలు అన్నీ కృష్ణా జిల్లాలో ఉండిపోయాయి అని పేర్కొంటుంది.

విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలో న‌ల‌భై ఐదు గ్రామాల్లో 25 గ్రామాలు కృష్ణా జిల్లాలో ఉండిపోగా ఇర‌వై మాత్రమే ఇక్క‌డ ఉండిపోయాయి అని ప్ర‌ధాన మీడియా చెబుతున్న మాట. అంటే జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా రేప‌టి వేళ పాల‌న పరంగా రేప‌టి వేళ చిక్కులు త‌ప్ప‌వని అధికారులు కానీ సంబంధిత నాయ‌కులు కానీ చెప్ప‌క‌నే చెబుతున్నారా?