Begin typing your search above and press return to search.
బొత్సను మరీ అంతలా అవమానిస్తావా జగన్?
By: Tupaki Desk | 12 Aug 2015 12:39 PM GMTతన పార్టీ నేతల పట్ల జగన్ ఎలా వ్యవహరిస్తారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత మహానేత వైఎస్ మీద అభిమానంతో జగన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట ఉన్న చాలామంది.. కేవలం జగన్ వైఖరి నచ్చక.. తమతో వ్యవహరించే తీరుపై తీవ్రమైన ఆవేదనతో పార్టీ విడిచిపెట్టారన్న టాక్ వినిపిస్తుంటుంది.
పార్టీ విడిచి పెట్టిన పలువురు నేతలు.. జగన్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. ఆయన తీరు మనసును ఎంతగానో గాయపర్చిందని వాపోతుంటారు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం చూసినప్పుడు.. జగన్ ట్రీట్ మెంట్ కు నిలువెత్తు నిదర్శనమని చెబుతున్నారు.
బుధవారం మధ్యాహ్నాం హైదరాబాద్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో.. ఇటీవలే ఆ పార్టీలో చేరి చురుగ్గా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్ పార్టీలో జగన్ తర్వాత పెద్ద నేత ఎవరైనా ఉన్నారంటే.. నిన్నమొన్న పార్టీలో చేరిన బొత్సనే అని చెప్పాలి. అలాంటి నేత ప్రెస్ మీట్ అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టీవీల్లో లైవ్ ఇవ్వటం మామూలే.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బొత్స ప్రెస్ మీట్ ను స్టూడియో ఎన్ లాంటి ఛానల్ లో సైతం లైవ్ ఇస్తే.. సొంత పార్టీకి చెంది ఛానల్ లో మాత్రం ప్రెస్ మీట్ ను లైవ్ ఇవ్వకుండా ఏదో క్రైమ్ వార్తల్ని ప్రసారం చేయటంపై పలువురు ముక్కున వేలేసుకునే పరిస్థితి. తానేం చేయాలనుకున్నారో చేసేసే జగన్.. తమ పార్టీ నేతల్ని ఎలా ట్రీట్ చేస్తారన్న దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా.. బొత్స ప్రెస్ మీట్ కు మించిన విషయం.. ఆ పార్టీ ఛానల్ కు ఇంకేం ఉంటుందబ్బా..?