Begin typing your search above and press return to search.

దుర్గ‌మ్మ కొండ మీద అంత దారుణ‌మా?

By:  Tupaki Desk   |   26 Jun 2018 4:38 AM GMT
దుర్గ‌మ్మ కొండ మీద అంత దారుణ‌మా?
X
ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో కొంద‌రి అధికారుల దుర్మార్గ‌పు బుద్ధి ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అనాలోచితంగా వ్య‌వ‌హ‌రిస్తూ చేసిన దుర్మార్గం తాజాగా బ‌ట్ట‌బ‌య‌లైంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఉదంతం ఇప్పుడు వేలాది మంది మ‌హిళ‌ల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో మ‌హిళ‌ల‌కు తీర‌ని అవ‌మానం జ‌రిగిన వైనంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ కొండ మీద సీవీ రెడ్డి చారిటీస్ పేరిట కాటేజీని నిర్వ‌హిస్తున్నారు. కాటేజీ మొయిన్ హాల్లో ల‌క్ష్మి పేరుతో ప్ర‌త్యేక‌మైన ఏసీ డార్మిట‌రీని ఏర్పాటు చేశారు. ఈ డార్మిట‌రీలో 8 బెడ్స్ ఉన్నాయి. పెళ్లిళ్లు.. ఇత‌ర శుభ‌కార్యాల కోసం దీన్ని బుక్ చేసుకుంటారు. అక్క‌డున్న ఖాళీ స్థ‌లంలో మ‌హిళ‌లు దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. భ‌ద్ర‌త కోసం కెమేరాలు ఏర్పాటు చేసిన‌ట్లు చెబుతున్న అధికారులు.. మ‌హిళ‌లు బ‌ట్ట‌లు మార్చుకునే ప్రాంతంలోనూ కెమేరా ఏర్పాటు చేయ‌టం.. అది కాస్తా ప‌ని చేస్తున్న వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇటీవ‌ల ఒక పెళ్లి బృందం ఈ డార్మిట‌రీని అద్దెకు తీసుకోవ‌టం.. పెళ్లి త‌ర్వాత డార్మిట‌రీలో ఉన్న సామాన్ల‌ను బ‌య‌ట‌కు తెచ్చేందుకు మ‌గ‌వారు లోప‌ల‌కు వెళ్ల‌టం.. ఈ సంద‌ర్భంగా బ‌ట్ట‌లు మార్చుకునే చోట కెమేరా ఆన్ అయి ఉండ‌టం.. సందేహంతో రికార్డింగ్ రూమ్‌కి వెళ్లి చూడ‌గా.. ప‌ని చేస్తున్న వైనాన్ని చూసి షాక్ తిన్నారు.

మ‌హిళ‌లు బ‌ట్ట‌లు మార్చుకునే ప్రాంతంలో కెమేరా ఏర్పాటు చేయ‌ట‌మే త‌ప్పు అయితే.. ఎలా రికార్డు చేస్తారు? అన్న నిల‌దీత‌కు అర్థం లేని స‌మాధానాలు ఇస్తూ.. త‌ప్పును క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌టాన్ని ప‌లువురు మండిప‌డుతున్నారు. డార్మిట‌రీలో బ‌ట్ట‌లు మార్చుకునే ప్రాంతంలో కెమేరా ఉండ‌టాన్ని నిల‌దీస్తున్న వారికి ఆల‌య అధికారులు సంబంధం లేని స‌మాధానాలు చెబుతూ.. త‌మ త‌ప్పేం లేన‌ట్లుగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. జ‌రిగిన దారుణంపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అధికారులు అందుకు భిన్నంగా చెబుతున్న మాట‌లు మ‌రింత మంట మండేలా ఉన్నాయి. ఆల‌య ఈవో ప‌ద్మ మాట‌ల్నే చూస్తే.. డార్మెట‌రీ అన్న‌ది విశ్రాంతి తీసుకోవ‌టానికి త‌ప్పించి.. బ‌ట్ట‌లు మార్చుకోవ‌టానికి కాదంటూ చెబుతున్న మాట‌లు వింటే అవాక్కు అవ్వాల్సిందే. విశ్రాంతి మందిరంలో వ‌స్త్రాలు మార్చుకోవ‌టం మామూలైన విష‌యం. కానీ.. త‌మ త‌ప్పును క‌ప్పి పుచ్చుకోవ‌టానికి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మాట‌లు విన్న‌ప్పుడు మ‌రింత మంట పుట్ట‌టం ఖాయం. మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో ఆల‌య అధికారుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏందిది బాబు.. ఈ ఆరాచ‌కం?