Begin typing your search above and press return to search.
కొత్త దుమారంలో 'మెన్ ఇన్ ఆరెంజ్'!
By: Tupaki Desk | 27 Jun 2019 8:24 AM GMTమన రాజకీయాల్లో గుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఎప్పుడూ ఉండేదే. ప్రతి విషయంలోనూ నెగిటివ్ పార్ట్ చూడటం ఒక అలవాటుగా చెప్పాలి. తాజాగా అలాంటి వాదనే తీసుకొచ్చి ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా ప్రతి జట్టును రెండేసి రంగులతో ఉన్న జెర్సీలను తయారు చేయమని చెప్పింది.
దీనికి కారణం లేకపోలేదు. కొన్ని జట్ల జెర్సీల మధ్య కలర్స్ దాదాపుగా దగ్గరగా ఉంటాయి. మెన్ ఇన్ బ్లూ అన్నంతనే టీమిండియా గుర్తుకు వస్తుంది. కానీ.. ఇంగ్లండ్ జట్టు కూడా బ్లూ కలర్ కు దగ్గరగా ఉండే లైట్ కలర్ జెర్సీలు వేసుకుంటారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వేళ.. ఒకే రంగు పోలినట్లుగా ఉండటం ఒకటైతే.. అదంతా బాగుండదు. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో అతిధ్య జట్టు తాము వేసుకునే జెర్సీనే ధరిస్తే..రెండో జట్టు మాత్రం తాము సిద్ధం చేసుకున్న రెండో జెర్సీని ధరించాల్సి ఉంటుంది.
ఒకవేళ అతిధ్య జట్టు కాని రెండు జట్ల మధ్య ఇదే తరహాలో జెర్సీ కలర్స్ మధ్య తేడా వస్తే.. ర్యాంకింగ్ ఆధారంగా ఏ జట్టు తమ రెండో జెర్సీని వాడాలో చెబుతారు. ఇదంతా ఆటకు సంబంధించిన వ్యవహారమైతే.. ఇక ఆట నుంచి బయటకు వస్తే.. ఐసీసీ చెప్పిన దాని ప్రకారం బీసీసీఐ రెండో రంగు జెర్సీని తయారు చేయించింది. టీమిండియా రెండో జెర్సీ కలర్ ఆరెంజ్ కలర్ లో ఉండటం.. దానికి బ్లూకలపటంతో ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. చూసినంతనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాదిరిలా ఉంది.
ఇప్పటివరకూ మెన్ ఇన్ బ్లూ జట్టుగా పాపులర్ అయిన టీమిండియా.. ఈ కొత్త ఆరెంజ్ కలర్ జెర్సీ ధరిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో ఉంటే.. దేశంలోని రెండు రాజకీయ పార్టీలకు మాత్రం అందుకు భిన్నమైన భావన కలిగింది. ఆరెంజ్ కలర్ తో జెర్సీ అంటే టీమిండియా జట్టును కాషాయీకరణ చేస్తున్నారంటూ పనికిమాలిన ఆరోపణలు మొదలెట్టారు. ఈ తరహా వాదనలు మొదలుపెట్టిన పార్టీలు ఏమంటే.. మొన్నటి ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపలేక చతికిలపడిన కాంగ్రెస్ ఒకటైతే.. రెండోది సమాజ్ వాదీ పార్టీ.
సంబంధం లేని అంశాల్ని లింకు పెట్టేసి దానికి కాషాయీకరణ పేరు పెట్టటం ద్వారా దేశంలోని మెజార్టీలలో మరింత పట్టుదల పెరగటం ఖాయం. ఇప్పటికే తమ తీరుతో దేశంలోని మెజార్టీలలో కొత్తతరహా ఆలోచనలతో ఉన్న వారికి మరింత బలం చేకూరేలా ఈ పార్టీల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.
ఆటను ఆటగా చూస్తే బాగుంటుంది కానీ.. బీసీసీఐ లాంటి ఒక స్వతంత్ర సంస్థ తయారు చేయించిన జెర్సీలో ఆరెంజ్ ఉన్నంతనే కొత్త అనుమానాలు బయటపెట్టటం సబబు కాదు. అయినా.. ఆరెంజ్ ఏమైనా నిషేధిత కలరా ఏమిటి?