Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ 'వారాహి'పై మొదలైన వివాదం
By: Tupaki Desk | 8 Dec 2022 3:30 PM GMTపవన్ కళ్యాన్ సమరశంఖం పూరించాడు. తన శక్తి యుక్తులన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఎన్నికల సమరంలోకి దూకేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. నిన్ననే దాన్ని గురించి ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేవాడు. వచ్చే ఎన్నికల కోసం ఈ బస్సులోనే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయనున్నారు. ఇందులో ఎన్నో అత్యాధునిక హంగులు, వసతులు కల్పించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసిన అనంతరం వాహనం వినియోగించాలని నిర్ణయించారు.
ఈ వాహనం సిద్ధం కాగానే షూటింగ్లో ఉన్న పవన్ వద్దకు తీసుకెళ్లారు. తన ప్రచారరథం గురించి పవన్ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ వాహనానికి 'వారాహి' అని నామకరణం చేశాడు. ఇప్పుడు ఇదే వాహనంపైన వివాదం రాజుకుంది. మిలటరీ వెహికల్ టైపులో పవన్ ప్రచారం రథం కనిపించడంతో కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ ప్రచార రథానికి 'వారాహి' అనే అమ్మవారి పేరు పెట్టడాన్ని కొందరు సంప్రదాయవాదులు తప్పుపడుతున్నారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు 'వారాహి'. అమ్మవారి ఆశీర్వాదం ఉంటే విజయం వరిస్తుందని అందరి నమ్మకం. ఎన్నికల యుద్ధానికి రథం సిద్ధం చేసుకున్న జనసేనాని.. ఈ యుద్ధంలో అమ్మవారి ఆశీర్వాదంతో గెలవాలని భావిస్తున్నారు.
అందుకే ప్రచార రథానికి ఆ అమ్మవారి విజయానికి సంకేతమైన 'వారాహి' పేరు పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా 'వారాహి'ని పురాణాలు చెబుతాయి. వరహా రూపంలోని అమ్మవారి సూచికను ఒక వాహనానికి పెట్టడంపై సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు చేయవద్దని వివాదాన్ని రాజేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం ట్రాఫిక్, వాహనచట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు అంటున్నారు. ఆయన వాహనానికి వేసిన రంగు ఆలివ్ గ్రీన్ మిలటరీవారు మాత్రమే వినియోగిస్తారని.. రక్షణరంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేటు వాహనాలకు ఈ రంగు వాడటంపై నిషేధం ఉంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోనూ అక్కడి ప్రభుత్వం ఇదే అంశంపై ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలివ్ గ్రీన్ లో ఉన్న వాహనాలు వెంటనే రంగు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పుడు పవన్ వ ాహనం కూడా ఇదే రంగులో ఉండడంతో మార్పు తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రక్రియ పూర్తికాలేదు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో దీనిపై అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.