Begin typing your search above and press return to search.

ఓవర్ నైట్ స్టార్ గా మారిన కూలీ.. ఎలాగంటే?

By:  Tupaki Desk   |   15 Feb 2022 10:30 AM GMT
ఓవర్ నైట్ స్టార్ గా మారిన కూలీ.. ఎలాగంటే?
X
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఎంతో మంది ఓవర్ నైట్ స్టార్లు పుట్టుకొస్తున్నారు. చాలా మందిలో దాగి ఉండే నైపుణ్యాలను ఇవి వెలికి తీస్తున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ నుంచి పుట్టుకొచ్చిన సెలబ్రిటీల పేర్లను టకా టకా చెప్పవచ్చు. రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద పాటలు పాడుకూంటూ భిక్ష మెత్తుకుంటా వచ్చిన వాళ్ల నుంచి... కచ్చా బాదం విక్రయించే వ్యక్తి దాకా స్టార్లుగా మారిపోయారు. తాజాగా వీరి జాబితాలోకి మరో వ్యక్తి చేరారు. నిన్నటి దాకా కూలీగా ఉన్న ఆయన ఇవాళ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు.

కేరళకు చెందిన మమ్మికా వయసు 60 ఏళ్లు. కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆయన జీవితంలో అనుకోని మలుపు తిరిగింది. ఓ ఫొటోగ్రాఫర్ దేవుడిలా వచ్చి... ఆయను స్టార్ ను చేశారు. మమ్మికా రోడ్డు మీద నడుస్తుంటే వచ్చారు ఫొటోగ్రాఫర్ షరిల్ వయలిల్. మమ్మికాను చూసి ఓ ఫొటో షూట్ చేస్తానని అన్నారు. అందుకు షాకైన మమ్మికా.. నాతో జోకులు ఏంటి బాబు అంటూ వెళ్లబోయాడు.

మమ్మికా వెళ్తుండగా అడ్డుకున్న ఆ ఫొటో గ్రాఫర్.. ఫొటో షూట్ కు అనుతించండి అంటూ మరోసారి అడిగారు. అప్పుడు మమ్మికా సరేనన్నాడు. ఇంకేం వెంటనే ఆయనను ఓ సెలూన్ కు తీసుకెళ్లారు. తన గెటప్ అంతా మార్చేశారు.

మమ్మికాను ఇంట్లోవాళ్లు కాదు ఆయనే గుర్తుపట్టలేనంతగా స్టయిలిష్ గా తీర్చి దిద్దారు. అనంతరం ఓ కాస్ట్లీ డ్రెస్ కొన్నారు. స్టైలిష్ లుక్, ట్రెండింగ్ కాస్ట్యూమ్స్, కళ్లకు మంచి గ్లాసెస్, కాళ్లకు ఖరీదైన షూస్ తొడిగారు. చివరకు ఓ ట్రెండీ ఫొటో షూట్ చేశారు.

ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించిన ఆ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూలీ అవతారంలో ఉన్న మమ్మికా... స్టయిలిష్ డ్రస్ లోని మమ్మికా స్టిల్స్ ను కలిపి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

సన్నగా, ఫిట్ గా బారు ఎత్తుతో ఉన్న మమ్మికాకు గడ్డం కూడా స్టయిల్ గా ఉంది. నిన్నటి దాకా కూలీ లాగా ఉన్న మమ్మికా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లుక్ అదుర్స్ అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఇంకేం... కూలీ మమ్మికా ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు.