Begin typing your search above and press return to search.
కానిస్టేబుల్ ను చితకబాదిన బీజేపీ నేత?
By: Tupaki Desk | 23 April 2017 4:44 PM GMTమధ్యప్రదేశ్ లో ఓ బీజేపీ నేత పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి దారుణంగా కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుణ నియోజకవర్గానికి చెందిన బీజేపీ బ్లాక్ ప్రెసిడెంట్ శోభన రఘువంశి భర్త రాజీవ్ రఘువంశీ ఈ దాడికి పాల్పడినట్లు బాధిత కానిస్టేబుల్ అశుతోష్ తివారీ ఫిర్యాదు చేశారు.
శోభనకు బంధువులైన ముగ్గురు అమ్మాయిలు ఒకే టూ వీలర్ పై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో వారికి ఫైన్ వేశారు. అయితే... జరిమానా చెల్లించిన ఆ అమ్మాయిలు వెంటనే అక్కడి నుంచే రాజీవ్ రఘువంశీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆయన అనుచరులను వెంటేసుకుని వచ్చి పోలీసులపై దాడి చేశాడు. కానిస్టేబుల్ ను కిందపడేసి దారుణంగా కొట్టినట్లు చెబుతున్నారు. 12 మంది వచ్చి తనను దారుణంగా కొట్టారని మిగతా కానిస్టేబుళ్లు జోక్యం చేసుకుని వారిని ఆపి తనను రక్షించారని బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు.
అయితే.. రాజీవ్ మాత్రం తాను అక్కడ లేనని చెబుతున్నారు. తన సోదరుడు వెళ్లాడని.. పోలీసులకు, ఆయనకు వాగ్వివాదం జరగడంతో ఒకరినొకరు నెట్టుకున్నారని.. ఆ క్రమంలో ముందు పోలీసులే దాడి చేశారని చెబుతున్నాడు. కాగా పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో రాజీవ్ లేకపోవడం విశేషం. బీజేపీ నేత కావడంతోనే ఆయన్ను కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/